జైలు నుంచి విడుదలైనట్లుంది: టి బిల్లుపై బలరాం

తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా బలరాం నాయక్ తెలిపారు. హైదరాబాద్‌లో సోనియా గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. జిల్లాను యూనిట్‌గా తీసుకుని అసెంబ్లీ స్థానాలు పెంచాలని ఆయన కోరారు. తెలంగాణ ఇప్పుడు రాకుంటే ఎప్పుడూ వచ్చేది కాదని బలరాం నాయక్ అన్నారు.
బిల్లు ఆమోదం పొందేవరకూ పోరాటం: కోదండరాం
అమరుల త్యాగం ఫలితంగానే తెలంగాణ బిల్లు తెచ్చుకోగలిగామని తెలంగాణ జెఏసి ఛైర్మన్ కోదండరాం అన్నారు. శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న కోదండరాం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించిన యూపిఏ ప్రభుత్వానికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. సీమాంధ్ర ప్రజలు శాంతియుతంగా ఉండి రాష్ట్ర విభజనకు సహకరించాలని ఆయన అన్నారు. రెండు మూడు రోజుల్లో చర్చలు జరిపి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications