‘‘ఆ వ్యాఖ్యలు కులదురహంకారమైనవే.. అనిత ఫిర్యాదు చేస్తే రోజాపై విచారణ’’

Posted By:
Subscribe to Oneindia Telugu

ఏలూరు: అసెంబ్లీలో ఎమ్మెల్యే రోజా దళిత ఎమ్మెల్యే అనితపై దుర్మార్గమైన వ్యాఖ్యాలు చేశారని, ఈ విషయంలో అనిత కమిషన్ ముందుకు సాక్ష్యాధారాలతో వచ్చి ఫిర్యాదు చేస్తే అసెంబ్లీ స్పీకర్ సహకారంతో రోజాపై విచారణ చేపడతామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌ కారెం శివాజీ అన్నారు.

ఆదివారం ఆయన మార్టేరులోని స్వగృహనికి విచ్చేసిన సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే అనితను ఉద్ధేశించి రోజా చేసిన వ్యాఖ్యలు కులదురహంకర మైనవన్నారు.

ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు చేస్తే స్పందిస్తామన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో దళితుల సంక్షేమ రంగానికి 15 శాతం మేర నిధులు పెంచారని, నిరుద్యోగ భృతికి ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిందన్నారు.

"We will investigate on Roja, If MLA Anita give a Complaint against her with evidences"

క్రైస్తవులు జెరూసలేం వెళ్లేందుకు గతంలో రూ.20 వేలు ఇచ్చేవరని, ఇప్పుడు దీన్ని రూ.40 వేలకు ప్రభుత్వం పెంచిందన్నారు. కమిషన్ సభ్యులు కర్రా రాజారావు మాట్లాడుతూ శివాజీ నేతృత్వంలో దళిత, గిరిజనుల సమస్యల పరిష్కరానికి కృషి చేయనున్నట్లు చెప్పారు.

అంబేద్కర్‌కు నివాళి...

తొలుత నాయకులు, అభిమానులు మార్టేరు సెంటర్‌కు చేరుకుని కారెం శివాజీకి ఘన స్వాగతం పలికారు. అక్కడ ఆయన అంబేద్కర్‌ విగ్రహనికి నివాళులర్పించారు. ఆయన తండ్రి రామ్మోహనరావు చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు కారెం శివాజీకి తమ సమస్యల పై వినతి పత్రాలు అందజేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
If MLA Anita complains against Roja with evidences.. certainly necessary action will be taken on Roja..says the SC, ST Commission Chairman Karem Shivaji to the press reporters when he visited his own house which is in Marteru on Sunday.
Please Wait while comments are loading...