పార్లమెంటులో లేవనెత్తుతాం
అమరావతి: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యిరు. ఈ సమావేశంలో ఇటీవల మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై ఎలా వ్యవహరించాలన్నవిషయంపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టుపై జరుగుతున్న పనులను వివరించి, త్వరితగతిన ప్రాజెక్టు పూర్తిచేయాలన్న డిమాండును బలంగా వినిపించాలని చంద్రబాబు ఎంపీలకు సూచించినట్లు తెలిసింది. కాగా, ఏపీకి ఇచ్చిన హామీలను, పోలవరం ప్రాజెక్టుకు నిధులను పార్లమెంటులో లేవనెత్తుతామని చెప్పారు.












Click it and Unblock the Notifications