భవిష్యత్తు గ్యారెంటీ- టీడీపీ మేనిఫెస్టో: ఆరు హామీలను ఆవిష్కరించిన చంద్రబాబు
రాజమండ్రి: రాజమండ్రి వేదికగా.. తెలుగుదేశం పార్టీ మహానాడును జరుపుకొంటోంది. ఇవ్వాళ రెండో రోజు. పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శతజయంతి కూడా తోడుకావడంతో ఇవ్వాళ్టి కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. పలు కీలక తీర్మానాలను ఆమోదించనుంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం తన ముగింపు సభలో పలు కీలక అంశాలను ప్రకటించే అవకాశం ఉంది.
ఎన్టీ రామారావు శతజయంత్యుత్సవాలను పురస్కరించుకుని చంద్రబాబు- ముగింపు ప్రసంగం చేశారు. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు అనే మూల సిద్ధాంతంతో ఆయన ఈ పార్టీని నెలకొల్పారని, ఆయన ఆశయాలను మరోసారి గుర్తు చేసుకుందామని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు.

అడ్డొచ్చిన వారిని తొక్కుకుంటూ వెళ్తామంటూ హెచ్చరించారు. ఇప్పటివరకు తన మంచితనాన్నే చూశారని, తనలోని రెండో కోణాన్ని చూస్తారంటూ గర్జించారాయన. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని చూసినవారు అడ్రస్ లేకుండా పోయారని అన్నారు. రౌడీయిజం, గూండాయిజాన్ని సహించబోనని, వారిని అణగదొక్కుతానని స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీకి మరోసారి అవకాశం ఇస్తే- ఇప్పటివరకూ ఎవరూ చూడనటువంటి సమర్థవంతమైన పరిపాలను అందిస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పారు. తనకు మరోసారి అధికారం ఇస్తే సంపదను సృష్టిస్తానని, దాన్ని పేదలకు పంచిపెడతానని అన్నారు. ప్రతి ఒక్కరి సలహాలు, సూచనలను స్వీకరిస్తానని, చెప్పింది వింటానని స్పష్టం చేశారు.
మహాశక్తి, యువగళం, ఇంటింటికీ మంచినీరు, పూర్ టు రిచ్, అన్నదాత, బీసీలకు రక్షణ చట్టం.. పేర్లతో కొత్త పథకాలను ప్రవేశపెడతానంటూ చంద్రబాబు మహానాడు వేదికగా ప్రకటించారు. మహిళల స్వయం సమృద్ధి, యువతకు ఉపాధి కల్పించడాన్ని తన బాధ్యతగా తీసుకుంటానని చెప్పారు. ఇంటింటికీ మంచినీటిని సరఫరా చేస్తామని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో అనేక గ్రామాలు, పట్టణాలకు మంచినీరు అందని పరిస్థితి ఉందని, దీన్ని తొలగిస్తానని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలోని పేదలందరినీ ధనవంతులను చేయడానికి ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తానని చంద్రబాబు చెప్పారు. దీనికోసం పూర్ టు రిచ్ అనే పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. పేదవాడు అనేవాడే లేకుండా చేస్తానని, ఇందులో రాజీపడబోనని అన్నారు. వ్యవసాయ రంగాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, అన్నదాతలను అన్ని విధాలుగా ఆదుకునేలా చర్యలు తీసుకుంటానని వివరించారు.
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ బీసీలకు ఏరకంగా కూడా రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల కోసం ప్రత్యేకంగా రక్షణ చట్టాన్ని తీసుకొస్తానని అన్నారు. ఇందులో భాగంగా ఆర్థిక, రాజకీయ, సామాజికపరంగా బీసీలందరికీ రక్షణ కల్పిస్తామంటూ చంద్రబాబు తేల్చి చెప్పారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications