వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి వచ్చాక వెలికి తీస్తాం: కిరణ్‌పై వివేక్, వైయస్‌పై నాగం

By Srinivas
|
Google Oneindia TeluguNews

We will reveal Kiran's illegal GOs: Vivek
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఉందని, కేంద్రం విభజన చేస్తుందని తెలిసినప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు సిఎంగా బాధ్యతలు చేపట్టారని, ఆయన సమైక్యవాది అయితే అప్పుడే ఆ పదవి వద్దని ఎందుకు చెప్పలేదని పెద్దపల్లి ఎంపి వివేక్ శనివారం ప్రశ్నించారు. 2009 డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణపై ప్రకటన చేసిన తర్వాతే కిరణ్ సిఎం అయ్యారన్నారు. అప్పుడు ఆయన సమైక్యవాది కాదా చెప్పాలన్నారు.

అధికారం చివరి రోజుల్లో ఉన్న కిరణ్ గడిచిన 50 రోజులుగా చాలా ఫైళ్లు క్లియర్ చేస్తున్నారని వివేక్ ఆరోపించారు. కేబినెట్ అనుమతి లేకుండా ఫైళ్లను పెద్ద ఎత్తున ఎలా క్లియర్ చేస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే కిరణ్ కాంట్రాక్టర్లను పిలిచి వివిధ పనులకు సంబంధించి అడ్వాన్సులు ఇచ్చి, తానూ అడ్వాన్సులు పుచ్చుకుంటున్నారని ఆరోపించారు.

మూడేళ్లుగా సిఎం పదవిలో ఉన్న కిరణ్ తన తమ్ముడు సంతోష్ రెడ్డితో కలిసి భూ కబ్జాలకు పాల్పడ్డారన్నారు. ఈ విషయాన్ని మాజీ డిజిపి దినేష్ రెడ్డి కూడా చెప్పారన్నారు. సిఎం ప్రోత్సాహం, ఫండింగ్ వల్లనే సీమాంధ్రలో ఉద్యమం నడుస్తోందని, అక్కడ సమ్మె విరమణ కోసం కాకుండా, ఇకపై ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంపైనే సీమాంధ్ర ఉద్యోగులతో కిరణ్ చర్చలు జరుపుతున్నారని ఆరోపించారు. సీఎంగా విఫలమైన కిరణ్ కొత్త పార్టీ పెట్టినా ఫెయిల్ అవుతారని, దాంతో అయ్యేది పోయేది ఏమీ లేదన్నారు.

తెలంగాణ వచ్చాక వైయస్ అక్రమాలపై కమిషన్: నాగం

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రభుత్వ వ్యవస్థలను సర్వనాశనం చేశారని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రత్యేక కమిషన్ వేసి ఆయన హయాంలో జరిగిన అక్రమాలను వెలికి తీస్తామని, తెలంగాణలో లూఠీ చేసిన డబ్బు ఎక్కడికి తరలించారనేది బయటకు లాగుతామని బిజెపి నేత, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి వేరుగా అన్నారు. ఏం అన్యాయం జరిగిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమన్యాయం అంటున్నారని ప్రశ్నించారు.

తుఫాను సహాయక చర్యల నిమిత్తం తెలంగాణ ప్రాంత మంత్రులను కోస్తాకు పంపాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌ రెడ్డికి నాగం సూచించారు. కోస్తా, ఉత్తరాంధ్రలోని తమ పార్టీ శ్రేణులతో ఇప్పటికే మాట్లాడామని, ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా కార్యకర్తలను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధం చేశామని చెప్పారు. రాష్ట్ర విభజనకు అడ్డుపడుతున్న కిరణ్ సీమాంధ్రులను రెచ్చగొట్టకుంటే శాంతి నెలకొంటుందన్నారు. సీమాంధ్రలో క్రెడిట్ కోసం కిరణ్, బాబు, జగన్ ముగ్గురూ జాకీచాన్‌లా పోరాటం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

English summary
Peddapalli MP Vivek said on Satureday that they will reveal CM Kiran Kumar Reddy's illegal GOs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X