వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాల: తప్పుడు ప్రచారం, వైసీపీ కొంపముంచేనా?

బిజెపితో వైసీపీ పొత్తంటూ టిడిపి తప్పుడు ప్రచారం చేస్తోందని శిల్పా చక్రపాణిరెడ్డి ఆరోపణ.బిజెపితో పోత్తు ఉండదన్నారు శిల్పా చక్రపాణిరెడ్డి.వ్యూహత్మకంగా టిడిపి ఈ ప్రచారం నిర్వహిస్తోందని వైసీపీ ఆరోపణ.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: బిజెపితో వైసీపీతో పొత్తు పెట్టుకొంటోందంటూ కొన్ని ప్రసారసాధనాలతో టిడిపి విషప్రచారం చేయిస్తోందని వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి ఆరోపించారు. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో బిజెపితో పొత్తు అంశం కొంపముంచే అవకాశం ఉందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

ఈ నెల 23వ, తేదిన నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో గెలుపు ఓటములపై ముస్లిం ఓటర్లు ప్రభావం చూపనున్నారు.

దీంతో ఈ ఎన్నికల్లో టిడిపి, వైసీపీ నేతలు ముస్లిం ఓటర్లను తమ వైపుకు తిప్పుకొనేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నాలను చేస్తున్నాయి.ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం నాడు నంద్యాలలోని ఫంక్షన్‌హల్‌లో ముస్లిం మతపెద్దలతో సమావేశమయ్యారు.

నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో విజయం కోసం టిడిపి, వైసీపీలు ప్రయత్నిస్తున్నాయి. 2019 ఎన్నికలకు నంద్యాల ఉపఎన్నికలు సెమీఫైనల్‌గా భావిస్తున్నారు విశ్లేషకులు . దీంతో ఈ ఉఫఎన్నికకు ప్రాధాన్యత ఏర్పడింది.

బిజెపితో పొత్తంటూ తప్పుడు ప్రచారం

బిజెపితో పొత్తంటూ తప్పుడు ప్రచారం

బిజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటుందంటూ ఎల్లో మీడియాతో టీడీపీ విష ప్రచారం చేస్తోందని శిల్పా చక్రపాణిరెడ్డి మండిపడ్డారు. నంద్యాలలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాకినాడలో బీజేపీ జెండాలతో తిరుగుతున్న చంద్రబాబు, నంద్యాలలో మాత్రం ఆ పార్టీ జెండాలు కనపడకుండా జాగ్రత్తపడుతున్నారని, మైనార్టీలను మోసం చేసే కుట్రకు చంద్రబాబు తెరలేపారని విమర్శించారు. బిజెపితో వైసీపీ పొత్తు పెట్టుకోవడం లేదని ఆయన చెప్పారు.

'అక్కకు బ్రెయినెక్కువ, నాకు వాయిసెక్కువ', 'రాజీనామాకు సై, అందుకే వైసీపీని వీడాం' 'అక్కకు బ్రెయినెక్కువ, నాకు వాయిసెక్కువ', 'రాజీనామాకు సై, అందుకే వైసీపీని వీడాం'

Recommended Video

Nandyal by-elections : Chandrababu Naidu holds Road Show, Watch Video
నష్టం జరగకుండా ఉండేందుకు..

నష్టం జరగకుండా ఉండేందుకు..

2014 ఎన్నికల సమయంలో కూడ టిడిపి-బిజెపిలు కూటమిగా పోటీచేశాయి.అయితే ఆ సమయంలో నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి టిడిపి అభ్యర్థిగా శిల్పా మోహన్‌రెడ్డి పోటీ చేశారు.వైసీపీ అభ్యర్థిగా భూమా నాగిరెడ్డి పోటీచేశారు. అయితే బిజెపితో పొత్తు కారణంగానే తాను ఓటమిపాలైనట్టుగా శిల్పా మోహన్‌రెడ్డి వైసీపీలో చేరిన సందర్భంగా ప్రకటించారు. బిజెపితో టిడిపి పొత్తు కారణంగా ముస్లింలు తమకు ఓటు వేయలేదన్నారు.అయితే ఈ ఎన్నికల సమయంలో ఆ రకమైన పొరపాటు జరగకుండా ఉండేందుకుగాను శిల్పా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. వైసీపీ ఎన్‌డిఏలో చేరనుందనే ప్రచారంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నంద్యాల ఎఫెక్ట్: మండలి ఛైర్మెన్ పదవి ఫరూక్‌కేనా, శిల్పా చేజార్చుకొన్నారా?నంద్యాల ఎఫెక్ట్: మండలి ఛైర్మెన్ పదవి ఫరూక్‌కేనా, శిల్పా చేజార్చుకొన్నారా?

.పోలింగ్‌కు 3 రోజుల ముందు బిజెపితో పొత్తుపై

.పోలింగ్‌కు 3 రోజుల ముందు బిజెపితో పొత్తుపై

నంద్యాల ఉప ఎన్నికలకు మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో ఎన్‌డిఏలోకి వైసీపీ చేరే అవకాశం ఉందని కొన్ని ప్రసార సాధనాల్లో కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. బిజెపితో పొత్తు ఉండబోదని తేల్చి చెబుతున్నారు.రాష్ట్రపతి ఎన్నికల సమయం నుండే వైసీపీ బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తోందనే సంకేతాలు వెలువడ్డాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఏ అభ్యర్థికి మద్దతును ప్రకటించింది వైసీపీ. వైసీపీపై కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మండిపడ్డాయి. ఆ ఎన్నికల నుండి బిజెపికి వైసీపీ దగ్గరౌతోందనే ప్రచారం ఉంది.

గంగుల Vs భూమా, ఒకే పార్టీలో ఇమిడేనా, అఖిలకు షాకేనా?గంగుల Vs భూమా, ఒకే పార్టీలో ఇమిడేనా, అఖిలకు షాకేనా?

టిడిపి జాగ్రత్తలు

టిడిపి జాగ్రత్తలు

నంద్యాల అసెంబ్లీ స్థానంలో జెండాలు, కండువాలు, బ్యాడ్జీలు లేకుండానే ప్రచారానికి రావాలని బిజెపి నేతలకు టిడిపి సూచించింది. అయితే టిడిపి సూచనపై కమలనేతలు ఒకింత ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ విషయమై వారు ప్రచారానికి దూరంగానే ఉన్నారు.కానీ, కాకినాడ కార్పోరేషన్‌లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంది. పొత్తులో భాగంగా బిజెపికి 9 డివిజన్లను టిడిపి కేటాయించింది.కానీ, నంద్యాల ఉప ఎన్నికల్లో బిజెపి నేతలను ప్రచారానికి దూరంగానే ఉంచింది టిడిపి.

English summary
Tdp wrong campaign on Ysrcp said Shilpa chakrapani reddy.We won't alliance with Bjp said Shilpa Chakrapani reddy.He spoke to media on Monday at Nandyal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X