అమరావతి వాతావరణ కేంద్రం లేటెస్ట్ న్యూస్
రానున్న మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. రాయలసీమ ప్రాంతంలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఏర్పడనున్నట్లు వెల్లడించింది.
మరోవైపు తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ దిక్కు నుంచే వీచే గాలులు తెలంగాణ మీదుగా తక్కువ ఎత్తులో వీస్తున్నాయని ప్రకటించింది. రాబోయే మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. రాష్ట్రంలో కొన్ని చోట్ల మెరుపులతో కూడిన వర్షం పడుతుందని, ఆదిలాబాద్, ఖమ్మం, ములుగు, కొమరం భీం, మంచిర్యాల, కొత్తగూడెం, సూర్యాపేట, భూపాలపల్లి జిల్లాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది.

అరేబియా సముద్రం లో బిపోర్ జాయ్ తుపాను ఏర్పడింది. తీరంవైపు దూసుకొస్తుండటంతో గుజరాత్ రాష్ట్రానికి అప్రమత్తత ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంబంధిత అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గుజరాత్ ప్రభుత్వం విద్యుత్తు, వైద్యం, తాగునీరు లాంటి అత్యవసర సేవలను అందుబాటులో ఉంచింది. 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 12 ఎన్టీఆర్ ఎఫ్ బృందాలను మొహరించారు. మరో 15 బృందాలను సిద్ధంగా ఉంచారు.
జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సైతం బిపోర్‌జాయ్ తుపాను సంసిద్ధత చర్యలను సమగ్రంగా సమీక్షించింది. 14వ తేదీ వరకు ఈ తుపాను ఉత్తర దిశగా కదులుతూ గుజరాత్ లోని కచ్, సౌరాష్ట్రలను దాటబోతోంది. 15వ తేదీ మధ్యాహ్నానికి గుజరాత్ లోని మాండ్వి, పాకిస్తాన్ లోని కరాచీ మధ్య జఖావూ పోర్ట్ సమీపంలో తీరం దాటనుంది. ఆ సమయంలో గంటకు 120 నుంచి 150 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయి.












Click it and Unblock the Notifications