ఉపరితల ద్రోణి ప్రభావం: ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర బీహార్ నుంచి జార్ఖండ్, ఇంటీరియర్ ఒడిశాల మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్రమట్టం నుంచి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉత్తర-దక్షిణ ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు

ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు

ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్‌లలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తాంద్ర వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడిందని వాతావరణ శాఖ అదికారులు చెప్పారు. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఉత్తరకోస్తాంధ్రలో 48 గంటలపాటు వర్షాలు

ఉత్తరకోస్తాంధ్రలో 48 గంటలపాటు వర్షాలు


ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లోని కొన్ని చోట్ల మంగళవారం ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు. బుధవారంనాడు ఉత్తరకోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. గురువారం ఉత్తరకోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

దక్షిణ కోస్తాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు

దక్షిణ కోస్తాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు

ఇక దక్షిణ కోస్తాంద్రలో మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు ఒకటి రెండు చోట్ల పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారంనాడు దక్షిణ కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయని చెప్పారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. గురువారంనాడు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి.

రాయలసీమలోనూ తేలికపాటి నుంచి భారీ వర్షాలు

రాయలసీమలోనూ తేలికపాటి నుంచి భారీ వర్షాలు

రాయలసీమ ప్రాంతంలోనూ దాదాపు ఇదే వాతావరణ పరిస్థితులు ఉంటాయని అధికారులు తెలిపారు. మంగళవారం రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. బుధవారం ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల కురుస్తాయని చెప్పారు.
మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+