• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అసెంబ్లీలో అదరగొట్టిన కుర్ర మంత్రి..! హనుమకు కుప్పి గంతులు నేర్పడం బాదేసిందన్న అచ్చెన్నాయుడు..!!

|

అమరావతి/హైదరాబాద్ : ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రసవ్తరంగా సాగుతున్నాయి. శాసన సభ సాక్షిగా దాదాపు పదేళ్ల కసినంతా వైసిపి నేతలు వెళ్లగక్కరుతున్నారు. ప్రతిపక్ష టీడిపి నేతలకు చుక్కలు చూపిస్తున్నారు వైసీపి నాయకులు. మూడేళ్లపాటు స‌మావేశాల‌కు దూర‌మైన వైసీపీ నేత‌లు మాంచి కాక‌మీదున్నట్టున్నారు. స‌మావేశంలో టీడీపీ ఎమ్మెల్యేల‌కు మాట్లాడే అవ‌కాశ‌మే కాదు.. ఎదురుదాడి చేస్తే ఎంత ఘాటుగా ఉంటుంద‌నేది రుచిచూపుతున్నారు.

మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ ఓ అడుగు ముందుకేసి పోల‌వ‌రంలో టీడీపీ అవినీతిని బ‌య‌ట‌కు తీస్తామంటూ తేల్చిచెప్పారు. సాగునీటి ప్రాజెక్టులో బాబు అండ్ కో చేసిన దారుణాల‌ను 40 రోజుల్లో బ‌య‌ట‌పెడ‌తామంటూ స్పష్టంచేశారు. మంత్రి మాట్లాడుతున్న స‌మ‌యంలో ఎలా స్పందించాల‌నేది తెలియ‌ని అచ్చెన్నాయుడు తొలిసారిగా పేల‌వంగా త‌న ప్రసంగాన్ని ప్రారంభించారు.

 ఏపీ అసెంబ్లీలో హోరాహోరీ..! రెచ్చిపోయిన అనిల్ కుమార్ యాదవ్..!!

ఏపీ అసెంబ్లీలో హోరాహోరీ..! రెచ్చిపోయిన అనిల్ కుమార్ యాదవ్..!!

పైగా చంద్రబాబుకు సాగునీటి ప్రాజెక్టుల గురించి చెప్పటాన్ని త‌ప్పుబ‌ట్టారు. ఓన‌మాలు తెలియ‌ని మంత్రి ద్వారా సూచ‌న‌లు చెప్పించుకోవ‌టం బాధ‌గా ఉందంటూ అచ్చెన్నా చేసిన కామెంట్‌కు అనిల్ కుమార్ యాద‌వ్ కాస్త ఘాటుగానే స్పందించాడు. తాను 40 ఏళ్ల సీనియార్టీ ఉంద‌ని చెప్పట్టేద‌ని.. మంగ‌ళ‌గిరిన మంద‌ల‌గిరిగా ప‌లికేంత పప్పును కాదంటూ చుర‌కేశారు. లోకేష్‌ను ఎమ్మెల్సీ చేసి దొడ్డిదారిలో మంత్రిని చేసిన ఘ‌నుడు బాబు అంటూ అనిల్ ఎద్దేవా చేశారు. ఏమైనా స‌భ‌లో లోకేష్‌ను మ‌రోసారి ప‌ప్పు అంటూ వ‌ర్ణించ‌టంపై టీడీపీ ఎలా స్పందిస్తుంద‌నేది చూడాలి.

అచ్చెన్నాయుడు వర్సెస్ అనిల్..! మద్యలో నారా లోకేష్..!!

అచ్చెన్నాయుడు వర్సెస్ అనిల్..! మద్యలో నారా లోకేష్..!!

ఏపీ అసెంబ్లీలో పాలక వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య ఈ రోజు కూడా మాటల యుద్ధం తప్పలేదు. టీడీపీకి వచ్చినవి 23 సీట్లే అయినప్పటికీ వాగ్దాటి ఉన్న నేతలు కొందరు ఆ 23 మందిలో ఉండడంతో వైసీపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు, ప్రస్తుత జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్‌ల మధ్య ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు చంద్రబాబుపై ఆరోపణలను ఖండించగా.. వైసీపీ నేత నారా లోకేశ్‌పైనా విమర్శలు మొదలుపెట్టారు.

 నీరు లేదు ప్రగతి లేదు..! నిధులు మాత్రం దోచుకున్నారన్న కుర్ర మంత్రి..!!

నీరు లేదు ప్రగతి లేదు..! నిధులు మాత్రం దోచుకున్నారన్న కుర్ర మంత్రి..!!

ధర్మపోరాట దీక్షల పేరుతో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు 500 కోట్ల రూపాయలు దోచేశారని ఇప్పటికే ఆరోపించిన ఏపీ జలవనరుల మంత్రి అనిల్ కుమార్ ఈ రోజు అసెంబ్లీలో.. పోలవరం ప్రాజెక్టు అంచనాలను టీడీపీ నేతలు ఇష్టానుసారం పెంచేశారనీ విమర్శించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు జోక్యం చేసుకున్నారు. తనదైన పద్ధతిలో ఎదురుదాడి ప్రారంభించారు. తమకు అవాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొన్ని విషయాల్లో తాము ప్రభుత్వానికి సలహా మాత్రమే ఇస్తున్నామని చెప్పారు. 'అధ్యక్షా.. మా పరిస్థితి ఎలా అయిందంటే.. అదృష్టం కొద్ది ఎలాంటి అనుభవం లేని ఓ వ్యక్తి ఇరిగేషన్ మంత్రి అయి చంద్రబాబుకే నీతులు చెబుతుంటే బాధగా అనిపిస్తోందన్నారు.

 అసెంబ్లీలో కూడా లోకేష్ ని వదలని వైసీపి..! పచ్చిగా విమర్శించిన నేతలు..!!

అసెంబ్లీలో కూడా లోకేష్ ని వదలని వైసీపి..! పచ్చిగా విమర్శించిన నేతలు..!!

'రాష్ట్ర సమస్యలపై ఎవరైనా మాట్లాడవచ్చు. కానీ నిన్న కాక మొన్న ఇరిగేషన్ మంత్రిగా అయి చంద్రబాబు నాయుడికే ఇరిగేషన్ మీద పాఠాలు చెబుతుంటే కొంచెం బాధగా అనిపిస్తోంది అధ్యక్షా' అచ్చెన్నాయుడు అనడంతో అనిల్ కుమార్ యాదవ్ తానేం తక్కువ తినలేదంటూ.. అధ్యక్షా. నేను డాక్టర్‌ను. ఈ ఫీల్డ్ కు నేను కొత్త అయ్యుండొచ్చు. కానీ తొందరగానే నేర్చుకుంటాం. చంద్రబాబు గారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అయ్యుండొచ్చు. మేం కాదనడం లేదు. కానీ ఆయన అడ్డగోలుగా దోచుకుని తింటూ ఉంటే, తప్పులు చేస్తుంటే యువనేతలు మాట్లాడకూడదు, రాజకీయాల్లోకి రాకూడదు అన్న రీతిలో అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు అధ్యక్షా. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేక ఎమ్మెల్సీగా జాబ్ తీసుకున్న పప్పును మాత్రం నేను కాదు అధ్యక్షా' అని విమర్శల వర్షం కురిపించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister Anil Kumar Yadav has taken a step back and said that TDP corruption will be brought to the fore in Pollavaram. Babu plight in the irrigation project was made clear in 40 days. Unaware of how to respond to the minister's speech, Achennayudu began his speech in a low voice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more