Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అప్రమత్తమైన జనసేన.. హడావుడిగా పిలిపించి: జగన్-పవన్‌లతో భేటీపై అసలు అలీ ఏం చెప్పారు?

Recommended Video

    Comedian Ali Met YS Jagan, Chandrababu and Pawan Kalyan | Oneindia Telugu

    విజయవాడ: ఈ నెల 9వ తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న టాలీవుడ్ కమెడియన్ అలీ ఆసక్తికరంగా ఆదివారం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఓ వైపు ఆయన వైసీపీలో చేరుతారని అంతకుముందు మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.

    అదే సమయంలో ఇప్పుడు జనసేనానిని కలవడం ఆసక్తిని రేపుతోంది. పవన్ కళ్యాణ్‌ను కలవడంపై తనను కలిసిన మీడియా ప్రతినిధులతో అలీ స్పందించారు. ఈ సమాధానంతో ఆయన పవన్ కళ్యాణ్‌కు అండగా జనసేనలో ఉంటున్నారా లేక వైసీపీలోకి నిజంగానే వెళ్తున్నారా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

     అందుకే పవన్ కళ్యాణ్‌ను కలిశా

    అందుకే పవన్ కళ్యాణ్‌ను కలిశా

    కొత్త సంవత్సరం (2019) వచ్చాక పవన్ కళ్యాణ్‌ను కలవలేదని, అందుకే కలిసేందుకు వచ్చానని కమెడియన్ అలీ తనను సంప్రదించిన మీడియాకు చెప్పారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకే పవన్‌ను కలిశానని చెప్పారు. జనసేనానిని మర్యాదపూర్వకంగానే కలిశానని, ఎలాంటి రహస్యం లేదని తేల్చి చెప్పారు. కలవడానికి ప్రాధాన్యత లేదన్నారు. జగన్‌తో భేటీపై ఇటీవల తనను కలిసిన మీడియా ప్రతినిధులతో అలీ మాట్లాడుతూ.. రెండు రోజుల్లో అన్నీ చెబుతానని అన్నారని తెలుస్తోంది.

    అలీ అలా చెప్పినప్పటికీ

    అలీ అలా చెప్పినప్పటికీ

    ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో భేటీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పేందుకేనని, సీక్రెట్ లేదని అలీ చెప్పినప్పటికీ.. తాను వైసీపీలో చేరడం లేదని, అవసరమైతే జనసేనలో చేరుతానని చెప్పినట్లుగా భావిస్తున్నారు. దాదాపు రెండు గంటల పాటు భేటీ కావడంతో రాజకీయపరమైన చర్చ జరిగిందని అంటున్నారు. అలీ అభిమానులు కూడా.. ఆయన జనసేనానితోనే ఉంటారని చెబుతున్నారట. కానీ అలీని మాత్రం మీడియా సంప్రదించగా... కొత్త సంవత్సరం కారణంగానే కలిశానని చెప్పారు.

    ఇద్దరు మంచి స్నేహితులు

    ఇద్దరు మంచి స్నేహితులు

    పవన్ కళ్యాణ్‌కు అలీ మంచి స్నేహితులు. పవన్ ప్రతి సినిమాలో అలీ ఉంటారు. వారి మధ్య ఎంతో స్నేహం ఉంది. ఈ విషయం టాలీవుడ్‌తో పాటు అభిమానులకు, సాధారణ ప్రజలకు కూడా తెలుసు. అలాంటి అలీ వైసీపీలో చేరడంపై చర్చకు దారి తీసింది.

     వైసీపీలోకి వెళ్తానని చెప్పి

    వైసీపీలోకి వెళ్తానని చెప్పి

    పవన్ కళ్యాణ్‌ను కలవకముందు, తాను వైసీపీలో చేరుతాననే ప్రచారంపై తనను సంప్రదించిన మీడియా ప్రతినిధులతో అలీ మాట్లాడుతూ.. ఈ నెల 9న జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నానని, ఆ పార్టీ సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా వైసీపీకి పని చేస్తానని చెప్పారట. అలా చెప్పి, ఇప్పుడు జనసేనానిని కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

    జనసేన అప్రమత్తమైందా, ఏం జరుగుతుంది?

    జనసేన అప్రమత్తమైందా, ఏం జరుగుతుంది?

    పవన్ కళ్యాణ్‌కు ఎంతో సన్నిహితంగా ఉండే అలీ వైసీపీలో చేరుతారనే ప్రచారం జరగడంతో జనసేన అప్రమత్తమైనట్లుగా చెబుతున్నారు. అలీ శనివారం భీమవరంలో ఓ కార్యక్రమంలో ఉండగా.. జనసేన పార్టీ నేత ముత్తంశెట్టి కృష్ణారావు ఆయనను హడావుడిగా పిలిపించారట. ఆ తర్వాత ఆదివారం ఉదయం పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు వచ్చిందని చెప్పి, అలీని జనసేనాని వద్దకు తీసుకు వెళ్లారని తెలుస్తోంది. పవన్ సన్నిహితుడే వైసీపీలో చేరితో జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని జనసేన అప్రమత్తమైనట్లుగా చెబుతున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+