Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుమల కల్తీ నెయ్యి కేసు రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు.. ఏమిటంటే ?

తిరుమల కల్తీ నెయ్యి కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ కేసు విచారణలో సిట్‌ వేగం పెంచింది. అరెస్టు చేసిన నలుగురు నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరింది. బోలె బాబా డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డెయిరీ సీఈఓ అపూర్వ విజయకాంత్ చావ్లా, ఏఆర్‌ డెయిరీ ఎండీ రాజు రాజశేఖరన్‌లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.అయితే నిందితులకు సంబంధించిన రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలను వెల్లడించింది.

అలానే కల్తీ నెయ్యి కేసులో అరెస్టు చేసిన నలుగురిని ఏ-2 నుంచి ఏ-5గా చేర్చింది. అలాగే ఏ-8గా వైష్ణవి డెయిరీ సీఈవో సబల్‌ షమీముల్లా ఖాన్‌ను పేర్కొంది. అయితే నిందితులు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు మొబైళ్లను ఆఫ్ చేసి, కొత్త ఫోన్లు కొనుగోలు చేసి, డిజిటల్ ఆధారాలు నాశనం చేయాలని ప్రయత్నించారని అధికారులు చెబుతున్నారు. పైగా, ఫోన్లు పోయాయని తప్పుడు సమాచారం ఇచ్చారని రిపోర్టులో తెలిపింది. 2019లోనే టీటీడీకి భోలేబాబా డెయిరీ నెయ్యి సరఫరా చేసినట్టు సిట్ గుర్తించింది. 2022లో ఈ సంస్థ ట్యాంకర్లను టీటీడీ తిరస్కరించినప్పటికీ.. ఆ తరువాత వైష్ణవి డెయిరీ పేరుతో మళ్లీ సరఫరా కొనసాగించినట్టు విచారణలో తేలినట్టు రిపోర్టులో స్పష్టం చేసింది.

What are the shocking truths in the Tirumala adulterated ghee case remand report

రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు..

తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ సంస్థ నెయ్యి సరఫరాకు ఒప్పందాన్ని పొందినప్పటికీ... ఉత్తరప్రదేశ్ కి చెందిన భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ.. తిరుపతికి చెందిన వైష్ణవి డెయిరీ ద్వారా కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు నిర్ధారించారు సిట్ అధికారులు. అసలైన ఉత్పత్తి సామర్థ్యం కన్నా ఎక్కువగా చూపించి ఏఆర్ డెయిరీ టెండర్ దక్కించుకున్నట్టు తెలిపారు. వార్షిక పాలు, నెయ్యి ఉత్పత్తిని తప్పుడు లెక్కలతో చూపించి టెండర్ సాధించినట్టు స్పష్టం చేశారు. అసలు 945.6 మెట్రిక్ టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా.. 3,072 మెట్రిక్ టన్నులుగా సంస్థ చూపినట్టు తెలిపారు.

అంతే కాకుండా టెండర్ సాధించేందుకు భోలేబాబా డెయిరీ నుంచి ఏఆర్ డెయిరీ 70 లక్షలు బదిలీ జరిగినట్టు తేల్చారు. టెండర్ కోసం అవసరమైన 51 లక్షల డిపాజిట్ మొత్తాన్ని కూడా భోలేబాబా సంస్థే చెల్లించిందని గుర్తించారు. 2024లో ఏఆర్ డెయిరీ కి టెండర్ 319.80 కి.గ్రా. ధరకు కేటాయించబడింది.. అయితే ఇదంతా అసలు నెయ్యి ధరకు తక్కువగా ఉండటంతో కల్తీ నెయ్యి సరఫరాకు అవకాశం కల్పించింది. టెండర్ దాఖలు సమయంలో 2024 మార్చి 12న చెన్నై నుంచి P.P. శ్రీనివాసన్ తప్పుడు డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేశారు. దీనిని డైరెక్టర్ డైరెక్టర్ పొమిల్ జైన్ సూచనల మేరకు చేసినట్టు తెలిపారు. ఏఆర్ డెయిరీకి ప్రతి కిలో నెయ్యికి 2.75 నుంచి 3 వరకు కమిషన్ ఇస్తామంటూ వైష్ణవి, భోలేబాబా డెయిరీలు రహస్య ఒప్పందం జరిగినట్టు ప్రత్యేక కమిటీ రిపోర్ట్ లో పొందుపరిచింది.

మరికొన్ని అరెస్టులు తప్పవా..?

బోలేబాబా డెయిరీ ఉద్యోగులను అజ్ఞాతంలోకి పంపారని సిట్‌ వెల్లడించింది. మరోవైపు ఈ వ్యవహారంలో మిగతా వారి ప్రమేయంపై ఆరా తీస్తున్న సిట్‌.. కీలక ఆధారాలతో త్వరలో మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 2020లో తమిళనాడు ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలో తనిఖీల కోసం వెళ్లిన టీటీడీ సిబ్బందిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే టీటీడీకి చెందిన పలువురు సిబ్బందికి విచారణకు రావాలని సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన వారిలో 10 మందికి పైగా అందుబాటులో లేరని సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+