• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అవును..ఇంతకీ ఆయన ఏమన్నారు.?ఎందుకంత డిప్లమసీ.?జూ.ఎన్టీఆర్ స్పందనపై విమర్శలు.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అమరావతి శాసనసభలో జరిగిన పరిణామాలపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గుండెలు పగిలేలా రోధించిన విషయం తెలిసిందే. ఇదే అంశం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన విషయం కూడా విదితమే. ఇక ఇదే ఘటనపై కుటుంబ సభ్యులే కాకుండా చాలా మంది ప్రముఖులు స్పందించారు. కొందరు చంద్రబాబుకు అనుకూలంగా, మరికొందరూ ప్రతికూలంగా స్పందించారు. చంద్రబాబు వావమరిది నందమూరి బాలకృష్ణ మరియు ఆయన కుటుంబ సభ్యులు విలేఖరుల సమావేశం నిర్వహించి జరిగిన సంఘటన పట్ల ఘాటుగా స్పందించారు. ప్రత్యర్థులను హెచ్చరించారు కూడా. ఇక్కడి వరకు కథ బాగానే ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ సెల్ఫీ వీడియోలో స్పందించిన అంశం పట్ల మాత్రం గందరగోళం నెలకొన్నట్టు తెలుస్తోంది.

 ఏం చెప్పాలనుకుని ఏం చెప్పారు.?జూ.ఎన్టీఆర్‌పై టీడీపీ నేతల విమర్శలు

ఏం చెప్పాలనుకుని ఏం చెప్పారు.?జూ.ఎన్టీఆర్‌పై టీడీపీ నేతల విమర్శలు

చంద్రబాబు సతీమణి, జూనియర్ ఎన్టీఆర్ మేనత్తను దూషించిన ఘటనలో యంగ్ టైగర్ స్పందించిన విధానం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తగిన విధంగా స్పందించలేదని,సెల్ఫీ వీడియోలో ఇంటెలెక్చువాలిటీ చూపించారు తప్ప విషయం చెప్పలేదని తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ కుమార్తె అయిన భువనేశ్వరిపై ఏపీ అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందన టీడీపీ నేతలకు అంతగా రుచించినట్టు లేదని తెలుస్తోంది. టీడీపీ నేత వర్ల రామయ్య భువనేశ్వరిపై వైఎస్ఆర్‌సీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పన్నెండుగంటల పాటు దీక్షకు ఉపక్రమిస్తున్నారు.

 అంత మేధావితనం ఎందుకు.?మామూలుగా ఖండిస్తే సరిపోయేది అంటున్న తమ్ముళ్లు

అంత మేధావితనం ఎందుకు.?మామూలుగా ఖండిస్తే సరిపోయేది అంటున్న తమ్ముళ్లు

ఈ దీక్ష సందర్భంగా మీడియాతో మాట్లాడిన వర్ల రామయ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు వచ్చారు. మేనత్తను దారుణంగా తిట్టినా ఎన్టీఆర్ స్పందన సరిగ్గా లేదని విమర్శించారు. కష్ట కాలంలో అండగా ఉన్న వారే పార్టీ సభ్యులుగా కొనసాగుతారని పేర్కొన్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల ఉందనే కారణంగా ఎన్టీఆర్ ఆచితూచి స్పందించారని వస్తున్న వాదనలపై కూడా వర్ల రామయ్య స్పందించారు. అందరికీ సినిమాలు ఉంటాయని బాలకృష్ణకు లేవా అని ప్రశ్నించారు. బాలకృష్ణ ఎలా స్పందించారో చూడాలన్నారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా అలాగే స్పందించారు. ఎన్టీఆర్ స్పందన ఆది, సింహాద్రిలా ఉంటుందనుకుంటే సామాన్యులకు అర్ధం కాకుండా నీతి సూక్తులు చెప్పారని నిరుత్సాహాన్నా వ్యక్తం చేసారు.

 కోడాలి, వల్లభనేని జూనియర్ కు అత్యంత సన్నిహితులు.. జూనియర్ ఎలా డీల్ చేస్తారు..?

కోడాలి, వల్లభనేని జూనియర్ కు అత్యంత సన్నిహితులు.. జూనియర్ ఎలా డీల్ చేస్తారు..?

చంద్రబాబు సతీమణిపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తవడంతో వింటర్ వెకేషన్ కోసం జూనియర్ ఎన్టీఆర్ యూరప్ టూర్‌కు వెళ్లారు. ఆయన కూడా అక్కడ్నుంచే వీడియో విడుదల చేశారు. అయితే ఆయన ఎవరి పేర్లనూ ప్రస్తావించలేదు. దీంతో ఆయన వేదంత ధోరణిలో సూక్తులు చెప్పారన్న అభిప్రాయం తెలుగు తమ్ముళ్ల నుండి వినిపిస్తోంది. టీడీపీ నేతలకు ఈ స్పందన అంతగా నచ్చలేదు. తల తోక లేకుండా స్పందించారని చెప్పుకొస్తున్నారు. అయితే మొదట్లో కొంతమంది నెగెటివ్ వ్యాఖ్యలు చేశారు కానీ ఇప్పుడు మాత్రం జూనియర్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

 మేనత్తని దూషించారు.. జూనియర్ ఘాటుగా స్పందించాలంటున్న తెలుగు తమ్ముళ్లు..

మేనత్తని దూషించారు.. జూనియర్ ఘాటుగా స్పందించాలంటున్న తెలుగు తమ్ముళ్లు..

చంద్రబాబు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ జూనియర్ ఎన్టీఆర్ కు మంచి సన్నిహితులు. జూనియర్ తో సింహాద్రి, ఆది, అల్లుడు వంటి చిత్రాలను కూడా వంశీ, కొడాలి నిర్మించారు. జూ.ఎన్టీఆర్ ఒత్తిడితోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొడాలి నానికి, వల్లభనేని వంశీకి పార్టీ టిక్కెట్లు ఇచ్చారనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పుడు వారు దారుణ ఆరోపణలు చేస్తున్నందుకు ఎన్టీఆర్ ఘాటుగా స్పందించాలన్నది తెలుగు తమ్ముళ్ల వాదన. మరి రానున్న రోజుల్లో ఇదే అంశంపై జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

English summary
Criticisms have been voiced over the manner in which Young Tiger reacted to the incident in which a junior NTR abused his aunt. The Tdp Cadre are dissatisfied that Junior NTR did not respond appropriately and did not say anything unless he showed intellectuality in the selfie video.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X