వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

20 లక్షల EVMలు ఏమయ్యాయి?

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం 60 లక్షల ఈవీఎంలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా సమాచార హక్కు చట్టంద్వారా అడిగిన ప్రశ్నకు జవాబుగా తమ వద్ద 40 లక్షల ఈవీఎంలే ఉన్నాయని చెప్పింది. మిగతా 20 లక్షలు ఏమయ్యాయో తమకు తెలియదని సమాధానం ఇచ్చింది.

కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన సమాధానాన్ని బట్టి 20 లక్షల ఈవీఎంలను ఎన్నికలకు అనుకూలంగా పోలింగ్ బూత్ ల్లో మార్చారా? లేదంటే లెక్కింపు కేంద్రాల్లో మార్చారా? రవాణా చేసేటప్పుడు మార్చారా? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పోలింగ్ జరిగిన ఓట్లకు, లెక్కింపు ఓట్లకు వందల్లో, వేలల్లో కాకుండా లక్షల్లోనే తేడా వచ్చినప్పటికీ ఈసీ ఇచ్చిన సమాధానం అందరికీ గుర్తుండే ఉంటుంది. చిన్న చిన్న పొరపాట్లు సహజంగా జరుగుతుంటాయని, పెద్ద ఎత్తున ఎన్నికలు జరిగినప్పుడు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. 100 కోట్ల ఓట్లతో తేడా వచ్చిన ఓట్లు లెక్కలోనికి రావంది. ఇప్పటికీ ఆ 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయో కేంద్ర ప్రభుత్వంకానీ, ఎన్నిక సంఘం కానీ ఇంతవరకు చెప్పకపోవడం గమనార్హం.

What happened to 20 lakh EVMs?

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కొత్త ప్రతిపాదన తీసుకువచ్చింది. ఓటింగ్ రోజు గ్రామంలోనూ , రాష్ట్రంలోనూ లేకపోయినప్పటికీ ఆన్ లైన్ ద్వారా ఎక్కడి నుంచైనా ఓటు వేసుకునే వెసుల‌బాటు క‌ల్పించాల‌ని భావిస్తున్నట్లు వెల్లడించింది. అయితే, విప‌క్షాలన్నీ మూకుమ్మ‌డిగా ఈ ప్ర‌తిపాద‌నను తోసిపుచ్చాయి. ఈ పార్టీలన్నీ గతంలో ఈవీఎం మాయాజాలం గురించిన ఫిర్యాదులు చేసినప్పటికీ వాటిపై ఇంతవరకు దర్యాప్తు జరపలేదు. తామెన్నిసార్లు ఎన్నిక సంఘాన్ని కలిసినప్పటికీ ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారేకానీ కేసు అతీగతీ ఏమైందో అర్థం కాకుండా ఉందని ఉభయ కమ్యూనిస్టు నాయకులు మండిపడ్డారు. ఈ సారి దొంగ ఓట్లను చేర్చి ఎక్కడో కూర్చుని ఆన్ లైన్ లో మీటలు నొక్కితే ఏమ‌వుతుందో అందరికీ తెలిసిందేనని వీరు వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాన్ని కేంద్రం అమల్లోకి తీసుకువస్తుందా? లేదా? అనే విషయంలో స్పష్టత రాలేదు. వేచిచూడాల్సి ఉంది.

English summary
The Central Election Commission has made 60 lakh EVMs available for the 2019 general elections across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X