చిరంజీవి నేర్పిన పాఠం: రజనీకాంత్-పవన్.. ఇద్దరి దారి ఒక్కటే, అవే విమర్శలు

Posted By:
Subscribe to Oneindia Telugu
  రజనీ ప్రభంజనం సృష్టిస్తారా ?

  చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, వ్యవస్థ చెడిపోయిందని, ఇలాంటి పరిస్థితుల్లోను తాను రాకుంటే తప్పు చేసిన వాడిని అవుతానని సూపర్ స్టార్ ప్రకటించారు.

  పవన్ కళ్యాణ్ మాట, రజనీ మనసులో మాట!: కానీ, చిరంజీవిని లాగి పొరపాటు చేశారా?

  రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రం నేపథ్యంలో ఎంజీఆర్, విజయకాంత్, జయలలిత, ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ తదితరులను గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా దక్షిణాదిన అటు సినిమా రంగంలో, ఇటు రాజకీయ రంగంలో ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలితలు హవా నడిపించారు.

  రాజకీయాల్లోకి వస్తున్నా, ద్రోహం చేయలేను, పిరికివాడు అంటారు, మీడియాతో భయం: రజనీకాంత్ సంచలనం

  రజనీకాంత్ ఓ శక్తి

  రజనీకాంత్ ఓ శక్తి

  రజనీకాంత్ అంటే ఓ వ్యక్తి కాదు.. శక్తి. అతనికి ఉన్న అభిమాన గణానికి లెక్కే లేదు. పేరుకే తమిళ నటుడు. కానీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక, దక్షిణాదిన ప్రస్తుత కాలంలో రజనీకాంత్ వంటి పేరున్న హీరో లేరు. అలాంటి రజనీ రాజకీయ ఆరంగేట్రంపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఆయన రాజకీయాల్లో నెగ్గుకు రాగలరా అనే చర్చ సాగుతోంది.

   రజనీకాంత్ కూడా చెప్పారు

  రజనీకాంత్ కూడా చెప్పారు

  రాజకీయాల్లో నెగ్గడం సాధారణ విషయం కాదని రజనీకాంత్ కూడా చెప్పారు. సముద్రంలో నుంచి ముత్యాలు తీసినంత కష్టమని తెలిపారు. అలా అని తనకు రాజకీయాలంటే భయం లేదని స్పష్టం చేశారు. రాజకీయ వ్యవస్థను మార్చాల్సి ఉందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో నిన్న చిరంజీవి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే నినాదంపై పార్టీని స్థాపించారు.

   చిరంజీవి నుంచి విజయ్ కాంత్ దాకా

  చిరంజీవి నుంచి విజయ్ కాంత్ దాకా

  చిరంజీవి పదేళ్ల క్రితం ప్రజారాజ్యం పార్టీని పెట్టి విఫలమయ్యారు. ఆయన ఉద్దేశ్యం మంచిదైనప్పటికీ పార్టీ నిలదొక్కుకోలేదు. దీంతో ఆ తర్వాత కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేయాల్సి వచ్చింది. తమిళనాట విజయ్ కాంత్ కూడా పార్టీని స్థాపించారు. కానీ ఆయన దూకుడుతో పార్టీ ప్రభావమే లేకుండా పోయింది. అలాగే, ఎంజీఆర్, ఎన్టీఆర్ వంటి వారు పార్టీ స్థాపించి విజయం సాధించారు. వీరి నుంచి రజనీ పాఠాలు నేర్చుకొని రాజకీయ రంగంలోకి దూకుతున్నారని చెబుతున్నారు.

   రజనీకాంత్ ఆరంగేట్రానికి, పవన్ చెబుతున్నదీ ఒకటే

  రజనీకాంత్ ఆరంగేట్రానికి, పవన్ చెబుతున్నదీ ఒకటే

  తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న నటుడు పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించారు. 2014కు ముందు ఆయన పార్టీ స్థాపించినప్పటికీ, ఆ ఎన్నికల్లో టిడిపి-బిజెపికి మద్దతు పలికారు. 2019లో పోటీ చేయనున్నారు. రజనీకాంత్ ఏ మాట అయితే చెప్పి రాజకీయాల్లోకి వస్తున్నారో.. అదే కారణాన్ని పవన్ చెబుతూ వస్తున్నారు. కాగా, పీఆర్పీ నుంచి పవన్‌తో పాటు రజనీకాంత్ కూడా పాఠాలు నేర్చుకొని ఉంటారని అంటున్నారు.

   ఇద్దరిదీ ఒకేదారి

  ఇద్దరిదీ ఒకేదారి

  ప్రస్తుత రాజకీయాలు చెడిపోయాయని, మార్చాల్సి ఉందని రజనీకాంత్ ఆదివారం ప్రకటించారు. రాజకీయాల్లో మార్పు కావాలని పవన్ కూడా చెబుతున్నారు. మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. మార్పు అంటే ప్రజలకు మంచి జరిగే మార్పు అని వీరి ఉద్దేశ్యం. రజనీకాంత్, పవన్‌లో ఒక్క తేడా ఉంది. జనసేనానికి ఆవేశం ఎక్కువ. రజనీకాంత్ సౌమ్యంగా ఉంటారు. ఇద్దరిదీ ఒకే దారి.

   పవన్ కళ్యాణ్‌పై వేసిన ప్రశ్ననే రజనీకాంత్‌కూ

  పవన్ కళ్యాణ్‌పై వేసిన ప్రశ్ననే రజనీకాంత్‌కూ

  ఇక్కడ మరో విషయం. పవన్ కళ్యాణ్‌పై ఎలాంటి విమర్శలు వచ్చాయో... రజనీ పార్టీని ప్రారంభించకముందే అలాంటి విమర్శలు వస్తున్నాయి. పవన్ మూడేళ్ల క్రితం పార్టీ స్థాపించినా ఇప్పటి వరకు విధివిధానాలు అంటూ ఏమీ లేవని విపక్షాలు విమర్శిస్తూ వచ్చాయి. రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్ర ప్రకటన చేయగానే సుబ్రహ్మణ్యస్వామి కూడా ఆయనపై ఇదే ప్రశ్న సంధించారు. మొత్తానికి విపక్ష నాయకులు వీరికి స్పష్టత లేదని ప్రచారం చేస్తున్నాయి.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  What is Superstar Rajinikanth says now, Already Pawan Kalyan said earlier.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి