కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు ఇలా - గతంతో పోల్చితే..!!
కేంద్ర బడ్జెట్ లో ఈ సారి ఏపీకి దక్కిన నిధుల పై చర్చ మొదలైంది. కేంద్రంలో..రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావటంతో ప్రత్యేకంగా కేటాయింపులు ఉంటాయనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ అమరావతికి రూ 15 వేల కోట్ల ప్రత్యేక రుణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. ఏపీకి గత ఏడాది..ఈ సారి కేటాయించిన నిధులను పోల్చి లెక్కలు మొదలయ్యాయి.
స్టీల్ ప్లాంట్ కోసం
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు 2023-24 బడ్జెట్‌లో రూ.683 కోట్లు కేటాయిస్తే, 2024-25 బడ్జెట్‌లో రూ.620 కోట్లు కేటాయించారు. అంటేరూ.63 కోట్లు కోత విధించారు. అలాగే విశాఖ పోర్టు ట్రస్ట్‌కు 2023-24 బడ్జెట్‌లో రూ.276 కోట్లు కేటాయిస్తే, 2024-25 బడ్జెట్‌లో రూ.150 కోట్లు కేటాయించారు. అంటే విశాఖ పోర్టు ట్రస్ట్‌కు రూ.126 కోట్లు కోత విధించారు. వైజాగ్ పెట్రోలియం యూనివర్సిటీకి రూ.168 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో కూడా రూ.168 కోట్లు కేటాయించి, సవరించిన అంచనాల్లో దాన్ని కాస్తా రూ.90 కోట్లకు కుదించారు. సెంట్రల్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీకి కేటాయింపులు ఏమీలేవు.

విద్యా సంస్థలకు
సెంట్రల్ యూనివర్సిటీకి గత బడ్జెట్‌లో రూ.112.08 కోట్లు కేటాయించగా, ఈసారి కేటాయింపులేమీ లేవు. అలాగే గిరిజన యూనివర్సిటీకి కూడా గత బడ్జెట్‌లో రూ.40.67 కోట్లు కేటాయించగా, ఈసారి ఏమీ కేటాయించలేదు. కేంద్ర విద్యా సంస్థలు ఐఐటి, ఐఐఎం, ఎన్‌ఐటి, ఐఐఎస్‌ఇఆర్, ట్రిపుల్ ఐటి, ఎయిమ్స్ వంటి వాటికి కేటాయింపులు చేయలేదు. విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు పరిశ్రమ, దుగ్గిరాజపట్నం పోర్టు, వైజాగ్, విజయవాడ మెట్రోలకు సంబంధించి బడ్జెట్‌లో ఊసేలేదు. తిరుపతి జిల్లాలోని మన్నవరం అంశం కూడా బడ్జెట్‌లో చోటుచేసుకోలేదు.
కేంద్ర పన్నుల వాటా
కేంద్ర పన్నుల్లో ఏపీకి ఈ ఆర్థిక సంవత్సరంలో (2024-25) రూ. 50,474.64 కోట్ల వాటా రానుంది. ఇది గత సంవత్సరం (2023-24) కంటే రూ. 5,776 కోట్లు (12.92%) అధికం. గత ఫిబ్రవరిలో పెట్టిన 49,364.61 కోట్ల రూపాయలతో పోలిస్తే ఇది రూ. 1,110 కోట్లు ఎక్కువ. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలకు కలిపి కేంద్రం 12,47,211.28 కోట్ల రూపాయల వాటాను పంచనుంది. అందులో 4.047% ఏపీకి దక్కనుంది. ఆంధ్రప్రదేశ్ రానున్న వాటాలో ఆదాయపన్ను నుంచి రూ. 17,455. 93 కోట్లు దక్కనుంది. ఆ తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ కింద రూ.15,156. 51 కోట్లు, సీజీఎస్టీ రూ.15,079.39 కోట్లు, కస్టమ్స్ ట్యాక్స్ రూ. 2,228.46 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ. 469.73 కోట్లు, సర్వీస్ ట్యాక్స్ రూ. 1.66 కోట్లు, ఇతర పన్నులు, సుంకాల కింద రూ. 82.96 కోట్లు రానుంది.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీలో మహిళలకు దక్కే నియోజకవర్గాలు లిస్టు ఇదే, కీలక మంత్రుల స్థానాలు సైతం..!! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications