Viral Video: నేను 'Gen Z’ అంటూ సైనికులతో యువతి వీరంగం.. నెటిజన్లు ఫైర్!
Viral Video: లద్ధాఖ్‌లోని కార్గిల్ జిల్లా మినీమార్గ్ చెక్‌పాయింట్ వద్ద ఓ మహిళా టూరిస్ట్ భద్రతా దళాల అధికారులతో తీవ్రంగా వాగ్వాదానికి దిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. భద్రతా కారణాలు, సైనిక వాహనాల రాకపోకల దృష్ట్యా అధికారులు రోడ్డును కొంతసేపు మూసివేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు మహిళ.. తాను జెన్-జీ అని.. ఇటువంటి చర్యలను సహించేదని లేదని హెచ్చరించింది. అంతే కాకుండా తాము చెల్లించిన పన్నుల డబ్బుతోనే సైనికులకు జీతాలు ఇస్తున్నారంటూ వారిపై కేకలు వేసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చిన వెంటనే నెటిజన్లు, మాజీ సైనికాధికారులు సదరు మహిళ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ రక్షణలో కీలకమైన సైనికులు కూడా పన్నులు చెల్లిస్తారని.. సరిహద్దు లాంటి అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా నిబంధనలను పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తుచేశారు. గడ్డకట్టే చలిలో ప్రాణాలను పణంగా పెట్టి విధుల్లో ఉండే సైనికులను పన్నుల పేరుతో అవమానించడం తగదని మండిపడ్డారు.

మాజీ లెఫ్టినెంట్ జనరల్ సతీష్ దువా, లెఫ్టినెంట్ కల్నల్ ఎన్.త్యాగరాజన్ వంటి మాజీ సైనికాధికారులు కూడా ఈ ఘటనపై స్పందించారు. అత్యవసర సమయాలు, సైనిక వాహనాల కదలికలు ఉన్నప్పుడు రహదారులను మూసివేయడం చట్టబద్ధమైన చర్య అంటూ వారు స్పష్టం చేశారు. జెన్-జీ అవ్వడం లేదా పన్నులు చెల్లించడం అనేది సరిహద్దుల్లో అధికారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడానికి లేదా నియమాలను ఉల్లంఘించడానికి లైసెన్స్ కాదని సూచించారు.
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కూడా ఈ వివాదంపై స్పందిస్తూ.. ఇది పాతకాలపు "నేనెవరో నీకు తెలియదా" అనే మనస్తత్వానికి కొత్త రూపమని అన్నారు. మరోవైపు మహిళ తీవ్రంగా అత్యంత ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ.. భద్రతా సిబ్బంది సహనంతో పరిస్థితులను చక్కదిద్దిన తీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
"Army salaries are paid from our taxes," said a female tourist in Ladakh where traffic was being regulated.
— Lt Gen Satish Dua 🇮🇳 (@TheSatishDua) August 19, 2026
Don't know more details but this comment is a degradation of the soldiers sacrifice.
Army personnel also pay taxes.
Being border area, Ladakh has security sensitivities. pic.twitter.com/GqQuSqbJq7












Click it and Unblock the Notifications
