అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీయాల్లో మార్పులు, నాకు భయంలేదు, ప్రత్యేకహోదాతో ఏం లాభం?:: చంద్రబాబు

హత్యచేసిన వాళ్ళే పూలదండలతో వస్తున్నారని, ఈ తరుణంలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.రాష్ట్రంలో రోజురోజుకు రాజకీయాల్లో మార్పులు చోటుచ

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ: హత్యచేసిన వాళ్ళే పూలదండలతో వస్తున్నారని, ఈ తరుణంలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.రాష్ట్రంలో రోజురోజుకు రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకొంటున్నాయని బాబు అభిప్రాయపడ్డారు.

ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ గుంటూరులో సభ నిర్వహించింది.ఈ సభలో వివిద పార్టీలకు చెందిన జాతీయ పార్టీలనాయకులు కూడ ఈ సభలో పాల్గొన్నారు.ఈ సభ ద్వారా రాష్ట్రంలో తన ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ.

ఈ సభకు వైసీపీ చీఫ్ జగన్ ను, జనసేన చీఫ్ పవన్ కళ్యాన్ ను ఆహ్వనించారు.అయితే వారిద్దరూ కూడ ఈ సభకు హజరుకాలేదు.అయితే ఈ సభ వేదిక పై నుండే వైసీపీ , టిడిపిలపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ విమర్శలు గుప్పించారు.

రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించిందనే భావన ప్రజల్లో బాగా నాటుకుపోయింది. దీంతో గత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగినవారికి డిపాజిట్లు కూడ దక్కలేదు. ఎన్నికల ముందే చాలా మంది కాంగ్రెస్ పార్టీని వీడారు. కొందరు వైసీపీ, మరికొందరు టిడిపిలో చేరారు.గుంటూరు సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

మరో వైపు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాల పట్ల టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అప్రమత్తమయ్యారు. అంతేకాదు పార్టీ నాయకులతో ఆయన టెలికాన్పరెన్స్ నిర్వహించారు

English summary
What is the benifit for Andhra pradesh state with Special status Andhra pradesh chiefminister Chandrababu naidu asked to Congress party. Babu teleconference with party leaders on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X