నంద్యాల: 2009లో 'పిఆర్‌పి' అభ్యర్థికి 35 వేల ఓట్లు, 'పవన్' మద్దతు కీలకం

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల:నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ముస్లిం మైనార్టీల తర్వాత కాపు, బలిజ ఓట్లు కీలకం కానున్నాయి. ఈ ఓటర్లు ఎటువైపుకు మొగ్గుచూపితే ఆ పార్టీ అభ్యర్థి విజయం నల్లేరుపై నడకేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఇదిలా ఉంటే, నంద్యాల ఉప ఎన్నిక విషయంలో ఎవరికీ మద్దతు ఇస్తారనే విషయమై జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ అధికారికంగా ప్రకటించలేదు.

జగన్ ఎఫెక్ట్:: ఈసీ ఏం చేయనుంది? వైసీపీకి టిడిపి చెక్ ఇలా...

నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఎవరికీ మద్దతిస్తోందోననే విషయాన్ని రెండు రోజుల్లో ప్రకటిస్తానని పవన్ కళ్యాణ్ ఇటీవల చంద్రబాబును కలిసిన సందర్భంలో ప్రకటించారు.

అయితే ఈ విషయమై ఇంకా తమ పార్టీ వైఖరిని ఆయన ఇంకా ప్రకటించలేదు. అయితే పవన్ మద్దతు కోసం టిడిపి , వైసీపీలు ప్రయత్నాలను చేస్తున్నాయనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై పవన్ ఇంకా నోరు విప్పలేదు.

జగన్ ఎఫెక్ట్: అఖిలప్రియ ధర్నా,ఈసీకి టిడిపి ఫిర్యాదు, పీకే వ్యూహంతోనే...

అయితే ఇప్పటికే వైసీపీ, టిడిపిలు ఈ స్థానంలో తమ ప్రచారాన్ని తీవ్రం చేశాయి. ఈ స్థానంలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలనే ప్లాన్ చేశాయి. రెండు పార్టీల నేతలు నంద్యాలలోనే మకాం చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు.

2009లో నంద్యాలలో 35వేల ఓట్లు దక్కించుకొన్న ప్రజారాజ్యం పార్టీ

2009లో నంద్యాలలో 35వేల ఓట్లు దక్కించుకొన్న ప్రజారాజ్యం పార్టీ


2009 ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ స్థానంలో ప్రజారాజ్యం అభ్యర్థికి 35 వేల ఓట్లు దక్కాయి.2009 ఎన్నికల్లో పిఆర్‌పి అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన శిల్పా మోహన్‌రెడ్డి విజయం సాధించారు. అయితే ఆనాటి పరిస్థితులకు ప్రస్తుత పరిస్థితులకు తేడా ఉంటుంది. అయితే ఆనాడు పోలైన ఓట్లలో 25 శాతం ఓట్లను పిఆర్‌పి దక్కించుకొంది. అయితే ఈ తరుణంలో పవన్‌కళ్యాణ్ మద్దతు కీలకంగా మారింది.

YSRCP Roja Satirical Comments on Pawan Kalyan
పవన్ ఏం చేస్తారనేది ఆసక్తి

పవన్ ఏం చేస్తారనేది ఆసక్తి


నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నిక విషయంలో జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ ఏం చేస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వారి తర్వాత కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. పవన్‌కళ్యాణ్ మద్దతు ఎవరికీ ఇస్తే ఆ ఓట్లలో మెజారిటీ ఆ పార్టీకి పడే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పవన్ మాత్రం ఇంతవరకు మద్దతు విషయమై అధికారికంగా ప్రకటించలేదు.

 జనసేనాని మౌనం ఎప్పుడు వీడుతారు?

జనసేనాని మౌనం ఎప్పుడు వీడుతారు?

జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ ఎప్పుడు మౌనం వీడుతారనే విషయమై ఉత్కంఠ నెలకొంది. నంద్యాలలో ఎవరికీ మద్దతివ్వాలనే విషయమై రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఇంకా ఆయన తన పార్టీ వైఖరిని ప్రకటించలేదు. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఎన్నిక సాగుతోంది. అయితే ఈ తరుణంలో పవన్ తీసుకొనే నిర్ణయం కీలకం కానుంది.
4. పవన్ ఎందుకు స్పందించడం లేదు

పవన్ ఎందుకు స్పందించడం లేదు

పవన్ ఎందుకు స్పందించడం లేదు

4. పవన్ ఎందుకు స్పందించడం లేదు
నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో మద్దతు విషయమై పవన్ మౌనంగా ఉండడం కూడ చర్చనీయాశంగా మారింది. ఈ తరుణంలో ఏ పార్టీకి మద్దతు ప్రకటించకుండా ఉండడం కూడ ఉత్తమమనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్టోబర్ నుండి పవన్ పూర్తికాలం పాటు రాజకీయాల్లో ఉండనున్నారు. అయితే అంతకుముందుగానే ఈ ఎన్నికలు జరుగుతున్నందున పవన్ తీసుకొనే నిర్ణయం ఈ ఉపఎన్నికపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
What is the decision of Janasena chief Pawan kalyan on Nandyal by poll.In 2009 elections PRP candidate was got 35000 votes from this assembly segment
Please Wait while comments are loading...