Ycp Vs Tdp: వైసీపీ ప్లీన‌రీకి, టీడీపీ మ‌హానాడుకు తేడా ఏమిటి?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేప‌ట్టిన త‌ర్వాత జ‌రుగుతున్న మొద‌టి ప్లీన‌రీ కావ‌డంతో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించారు. గుంటూరు-విజ‌య‌వాడ మ‌ధ్య జాతీయ ర‌హ‌దారిపై పెద‌కాకానికి స‌మీపంలో జ‌రిగిన ఈ ప్లీన‌రీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియ‌ర్ నేత‌లు అన్యాప‌దేశంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను పొగ‌డ‌డానికే త‌మ ప్ర‌సంగాన్ని వెచ్చించారు. పార్టీలోకానీ, రాష్ట్రంలోకానీ నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న దృష్టికి తీసుకువెళ్లే ప్ర‌య‌త్నం మాత్రం చేయ‌లేదు.

 అంచనాలకు మించిందనే అభిప్రాయం?

అంచనాలకు మించిందనే అభిప్రాయం?

తెలుగుదేశం పార్టీ మ‌హానాడును ఒంగోలులో నిర్వ‌హించింది. రాష్ట్ర‌వ్యాప్తంగా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు త‌ర‌లిరావ‌డానికి వీలుగా ఆర్టీసీ బ‌స్సుల‌ను అద్దెకు అడిగితే ప్ర‌భుత్వం నిరాక‌రించిందంటూ టీడీపీ నేత‌లు అధికార పార్టీపై మండిప‌డ్డారు. శ్రేణులంతా వ్య‌క్తిగ‌త వాహ‌నాల్లో స్వ‌చ్ఛందంగా త‌ర‌లిరావ‌డంతో చంద్ర‌బాబు అంచ‌నాల‌కు మించి మ‌హానాడు గ్రాండ్ స‌క్సెస్ సాధించింద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

 సాధారణంగా సాగిన సీఎం జగన్ ప్రసంగం?

సాధారణంగా సాగిన సీఎం జగన్ ప్రసంగం?


వైసీపీ ప్లీన‌రీలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌సంగం సాధార‌ణంగానే సాగింద‌ని, ఎప్ప‌టిలాగే ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంతోపాటు దుష్టచతుష్ట‌యం గురించి మాట్లాడార‌ని, ఆయ‌న ప్ర‌సంగంలో గ‌తంలో ఉన్న‌ట్లుగా ఎటువంటి మెరుపులు, ప్ర‌త్య‌ర్థుల‌పై చుర‌క‌లు లేవ‌ని శ్రేణులే అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీనికితోడు పార్టీ గౌర‌వాధ్య‌క్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతోపాటు కుమార్తె వెంట న‌డుస్తున్నాన‌ని ప్ర‌క‌టించ‌డం వైసీపీ శ్రేణుల‌ను నివ్వెర‌ప‌రిచింది. వేదిక‌పై రాజీనామా ప్ర‌క‌టించ‌కుండా ఉంటే బాగుండేద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 ప్రసంగం తీరును మార్చుకున్న చంద్రబాబు

ప్రసంగం తీరును మార్చుకున్న చంద్రబాబు


టీడీపీ మ‌హానాడులో చంద్ర‌బాబునాయుడు వైసీపీపై, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. చంద్ర‌బాబు ఎప్పుడు మాట్లాడినా చెప్పిన‌వే చెబుతార‌ని, కొత్త‌ద‌నం ఏమీ ఉండ‌ద‌నే వ్యాఖ్య‌లు గతం నుంచి ఉన్నాయి. అయితే ఈసారి చంద్ర‌బాబు త‌న మాట‌ల్లో కొత్త‌ద‌నం ఉండేలా చూసుకున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌పై మాట‌ల తూటాలు పేల్చారు. పంచ్ లు వేశారు. వాటికి ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న లభించింది. మహానాడే కాకుండా ఎక్కడ పర్యటించినా తన ప్రసంగం విభిన్నంగా ఉండేలా చూసుకుంటుండటంతో అనూహ్య స్పందన లభిస్తోంది.

 ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో..

ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో..


ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యంలో జ‌గ‌న్ మాట్లాడే ప్ర‌తి డైలాగ్‌ను ప్ర‌జ‌లు ఆస్వాదించారు. చెప్పిన డైలాగ్ నే చెబుతూ, అవి ప్రజల మెదళ్లో నానేలా చూసేవారని, కానీ
ఈసారి అటువంటివేవీ లేక‌పోవ‌డం వారిని నిరాశ‌ప‌రిచింది. గత రెండు సంవత్సరాలుగా ఎక్కడికి వెళ్లినా ప్రత్యర్థుల గురించి ఏం చెబుతున్నారో అదే చెబుతుండటం వైసీపీ నాయకులు, కార్యకర్తలను నిరాశకు గురిచేసింది.

ముఖ్యమంత్రిలో తగ్గిన ఉత్సాహం?

ముఖ్యమంత్రిలో తగ్గిన ఉత్సాహం?


అధికారంలో ఉన్నప్పుడు జరుగుతున్న ప్లీనరీ కావడంతో ఏర్పాట్లు భారీగా చేశారని, కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో ఉత్సాహం కనపడలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పొగిడినప్పుడు మాత్రం ముసిముసి నవ్వులు నవ్వారని, అంతకుమించి కొత్తదనం ప్లీనరీలో లేకపోయిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ప్రజల నుంచి వ్యక్తమవుతున్న స్పందనను అధికార పార్టీ గమనించాలని, తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో పరిశీలించుకొని పరిష్కరించుకుంటేనే మరోసారి అధికారం దక్కించుకోవాలనే ఆశ నెరవేరుతుందంటున్నారు. మరి సీఎం జగన్ ఏం చేస్తారో చూడాలి..!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+