AP Elections: ఏపీ ఎన్నికలపై ఓవరాల్ టాక్ ఏంటి ? తాజా పరిస్ధితి ఇదీ..!

ఏపీలో సరిగ్గా నెల రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. రాజకీయ పార్టీల ప్రచారానికి కేవలం 28 రోజుల సమయం మాత్రమే మిగిలుంది. అంటే ఈ నాలుగు వారాల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఓటరు తేల్చేయబోతున్నాడన్నమాట. ఈ నేపథ్యంలో ఓటరు నాడి ఎటువైపు ఉందో తెలుసుకునేందుకు చాలా సర్వే సంస్ధలు, ఏజెన్సీలు క్షేత్రస్ధాయిలో శ్రమిస్తున్నాయి. ఇప్పటికే పలు సర్వే నివేదికలు వెలువడ్డాయి. ఇందులో కొన్ని వైసీపీకి, మరికొన్ని విపక్షాలకు జై కొట్టాయి.

అయితే వాస్తవ పరిస్ధితి ఏంటన్న దానిపై వన్ ఇండియా తెలుగు రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరిస్తే ఓ విషయం మాత్రం స్పష్టమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ,జనసేన, బీజేపీ జట్టు కట్టడం వల్ల ఆయా పార్టీలకు లభిస్తున్న ప్రయోజనం పరిమితమే అని తేటతెల్లమవుతోంది. ముఖ్యంగా జనసేన, బీజేపీతో టీడీపీ జత కట్టడం వల్ల ఆ పార్టీకి అదనంగా లభించే ప్రయోజనం ఏదీ కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే బీజేపీతో పొత్తు ప్రకటన తర్వాత టీడీపీకి ఓటర్లలో ఆదరణ తగ్గినట్లు క్షేత్రస్ధాయిలో తాజా పరిస్దితులు స్పష్టం చేస్తున్నాయి.

what is the latest report on ap elections here are details

ఇందులో ఎన్నికల పోలింగ్ కు నెల రోజులు కూడా లేని ఈ తరుణంలో టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల పంపకాలు ఇంకా పూర్తి కాకపోవడం ప్రతికూలంగా మారబోతోంది. ఇప్పటికే జనసేనకు తక్కువ సీట్లు కేటాయించడంతో ఆ పార్టీకి పూర్తి స్ధాయిలో అండగా ఉంటారని భావిస్తున్న కాపుల్లో చీలిక కనిపిస్తోంది. అయితే ఇది ఏ స్ధాయిలో ఉందన్నది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. అలాగే టీడీపీ బలంగా ఉన్న సీట్లను బలహీనమైన బీజేపీ, జనసేన అభ్యర్ధుల చేతిలో పెట్టడం అతిపెద్ద మైనస్ గా మారబోతోంది.
ఇందులో అరకు, పాడేరు, నరసాపురం ఎంపీ, అనపర్తి, ఉంగుటూరు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

2019 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి జనసేనతో పొత్తు కారణంగా దాదాపు 50 సీట్లలో టీడీపీకి పూర్తిస్దాయిలో ఓట్లు బదిలీ అయి లాభం కలగాల్సి ఉంది. కానీ ప్రధాన నేతలు పోటీ చేస్తున్న సీట్లలో ఇబ్బంది లేకపోయినా జూనియర్ నేతలు పోటీ చేస్తున్న చోట్ల ఇబ్బందులు తప్పేలా లేవు. అలాగే బీజేపీతో పొత్తుపై ముస్లిం ఓటు బ్యాంకు పూర్తిగా ఈ కూటమికి దూరమయ్యేలా ఉంది. మరోవైపు ఇప్పటికే అభ్యర్ధుల ప్రకటన పూర్తి చేసిన వైసీపీ జనంలోకి పూర్తిస్దాయిలో వెళ్లి ప్రచారం చేసుకుంటోంది. ఇది వైసీపీకి మరోసారి ఆధిక్యం ఇస్తోంది.

ఇలా ఎటు చూసినా కూటమిలోకి బీజేపీ వచ్చాక టీడీపీ, జనసేనకు అదనపు ప్రయోజనం కలగడం లేదని స్పష్టమవుతోంది. ప్రధాని మోడీ సభకు ముందు టీడీపీ-జనసేన పొత్తుతో వైసీపీపై లభించిన ఎడ్జ్ కాస్తా ఇప్పుడు పోయిందన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఈ నెల రోజుల్లో అద్బుతాలు జరిగితే తప్ప పరిస్దితిలో ఎలాంటి మార్పూ ఉండకపోవచ్చని అర్ధమవుతోంది. మరోవైపు గతంలో ఓడిపోయిన లోకేష్, పవన్ ఈసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+