జగన్ దెబ్బ: ఆత్మరక్షణలో చంద్రబాబు, ఏం చేస్తారు?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకొంది. ప్రత్యేక హోదా విషయమై తమ పార్టీ ఎంపీలు ఆందోళనలు చేస్తారని వైసీపీ ప్రకటించింది. కేంద్రం నుండి స్పందన రాకపోతే 2018 ఏప్రిల్ 6వ, తేదిన వైసీపీ ఎంపీలు రాజీనామా చేయనున్నట్టు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మంగళవారం నాడు ప్రకటించారు.

వైసీపీ ఎంపీల రాజీనామాలు ఉత్తవే, ఎన్నికలొస్తాయి: జెసి దివాకర్ రెడ్డి

మరో వైపు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ పేరుతో ముందుకు వచ్చింది. కేంద్రం తీరుపై టిడిపి ఇప్పటికే ఆందోళనతో ఉన్న తరుణంలో రాష్ట్రంలో ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారంతో టిడిపి ప్రస్తుతానికి ఆత్మరక్షణలో పడినట్టు కన్పిస్తోంది.

పవన్‌కు షాక్: ఏ అధికారంతో లెక్కలడుగుతున్నారు: విష్ణు సంచలనం

అయితే మార్చి 5వరకు వేచి చూస్తామని చెబుతున్న నేతలు మార్చి 6వ, తేదిన ఎన్డీఏతో తెగదెంపులు చేసుకొంటారా లేదా అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.

ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం నుండి న్యాయం జరగలేదనేది అన్ని పార్టీలకు చెందిన నేతలు భావిస్తున్నారు. అయితే బిజెపి నేతలు మాత్రం టిడిపిపై విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని టిడిపి నేతలు చెబుతున్నారు.

జెఎఫ్‌సిపై ట్విస్టిచ్చిన బాబు: అందుకే ప్యాకేజీకి ఒప్పుకొన్నా, జగన్ అప్పుడేం చేశారు?

బిజెపితో మిత్రపక్షంగా ఉన్నా టిడిపి పార్లమెంట్‌లో నిరసనలు వ్యక్తం చేస్తోంది. రాజకీయంగా నష్టం కల్గించే పరిస్థితులుంటే ఏ రకంగా వ్యవహరించాలనే దానిపై కూడ టిడిపి నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.

 బాబు వ్యూహమేమిటీ?

బాబు వ్యూహమేమిటీ?

ఏప్రిల్ 6వ, తేదిన ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయాలని తీసుకొన్న నిర్ణయం రాజకీయంగా టిడిపికి ఇబ్బంది కల్గిస్తోంది. అయితే మార్చి 5వ, తేది నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.ఈ సమావేశాలను పురస్కరించుకొని రాష్ట్రానికి నిధుల విషయంలో పోరాటం కొనసాగిస్తామని టిడిపి నేతలు ప్రకటించారు. అయితే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయడం కంటే ముందే కేంద్రం నుండి టిడిపి వైదొలిగితే ఎలా ఉంటుందనే చర్చ కూడ లేకపోలేదు.కేంద్రం నుండి టిడిపి వైదొలిగితే వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు టిడిపికి కలిసివస్తోంది, రాష్ట్రానికి ఏ మేరకు కేంద్రం నుండి నిధులు వస్తాయనే అంశాలు కూడ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం కూడ ఉందని టిడిపి నేతలు చెబుతున్నారు. టిడిపి నేతలు కూడ బిజెపి తీరుతో కొంత విసిగిపోయి ఉన్నారు. దీంతో కేంద్రం నుండి వైదొలిగే అవకాశాలను కూడ తోసిపుచ్చలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

టార్గెట్ బాబు

టార్గెట్ బాబు

2019 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడును గద్దె దించడం కోసం వైసీపీ పావులు పావులు కదుపుతోంది. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే బిజెపితో చేతులు కలిపేందుకు కూడ సిద్దమేనని ఆ పార్టీ ప్రకటించింది. అయితే ప్రత్యేక హోదా అంశాన్ని తెరమీదికి తెచ్చి వైసీపీ మరోసారి సెంటిమెంట్అంశాన్ని రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారు.బిజెపి, టిడిపి మధ్య గ్యాప్ పెరుగుతున్నట్టు కన్పిస్తోంది.ఈ తరుణంలో అన్ని అవకాశాలను దృష్టిలో ఉంచుకొని టిడిపిని దెబ్బతీసేందుకు వైసీపీ ఇప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని తెరమీదికి తెచ్చింది. ఈ అంశాన్ని తీసుకొని పోరాటం చేయడం ద్వారా టిడిపిని రాజకీయంగా దెబ్బతీయొచ్చని వైసీపీ భావిస్తోంది.

 పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు

పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో బిజెపి, టిడిపి చెబుతున్న లెక్కలను తేల్చేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే జెఎఫ్‌సి ఏర్పాటు చేశారు.ఈ కమిటీ రాష్ట్రానికి వచ్చిన నిధుల విషయాన్ని లెక్క తేల్చే పనిలో పడింది. అయితే ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏం చేయాలనే విషయమై నిర్ణయం తీసుకొంటారని ఇప్పటికే ప్రకటించారు. అయితే వైసీపీ నేతలు ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో ధర్నాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం ఆందోళన నిర్వహించిన పవన్ కళ్యాణ్ వైసీపీ మద్దతిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రత్యేక హోదా కోసం వైసీపీకి మద్దతివ్వాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మారనున్న సమీకరణాలు

మారనున్న సమీకరణాలు

ఏపీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కన్పిస్తోంది. ప్రత్యేక హోదా అశంతో పాటు, ఏపీకి నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విమర్శల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కన్పిస్తోంది. మార్చి మొదటి వారంలో రాజకీయ సమీకరణాల్లో మార్పులపై స్పష్టత వచ్చే అవకాశం కన్పిస్తోంది. ప్రస్తుతం బిజెపితో టిడిపి మిత్రపక్షంగా ఉంది. అయితే బిజెపితో తెగదెంపులు చేసుకొంటుందా, వైసీపీ, బిజెపి కలుస్తాయా, పవన్ కళ్యాణ్ వైఖరి ఎలా ఉంటుందనే విషయాలపై రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There is a interesting discussion in Ap politics what is the next step of chandrababu naidu. Ysrcp chief ys Jagan announced its party future plan on Tuesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి