వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి కి సీఎం జగన్ హామీ దక్కిందా : వైసీపీ ట్రాప్ - ఆర్కే పోటీలో లేనట్టేనా..!!

|
Google Oneindia TeluguNews

మంగళగిరి. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారుతోంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు తనయుడు లోకేష్ ఇక్కడ పోటీ చేసి ఓడారు. అయినా, మంగళగిరి మీద లోకేశ్ ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచే గెలిచి గిఫ్ట్ గా ఇస్తానంటూ పార్టీ అధినేత చంద్రబాబుకు కార్యకర్తల సమక్షంలో మాట ఇచ్చారు. ఇక, మూడు రాజధానుల వ్యవహారం ను అనుకూలంగా మలచుకొనేందుకు లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో 2014లో మంగళగిరి నుంచి టీడీపీ అ్యర్ధిగా పోటీ చేసిన గంజి చిరంజీవి టీడీపీలోనే కొనసాగారు. లోకేష్ తో పాటుగా పార్టీ నియోజకవర్గ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే, ఇప్పుడు సడన్ గా పార్టీ మారటం వెనుక ఏం జరగిందనేది పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలైంది.

వైసీపీతో టచ్ లో చిరంజీవి

వైసీపీతో టచ్ లో చిరంజీవి


సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం పైనా నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో నియోజకవర్గంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిన చేనేత వర్గానికి చెందిన మాజీ మంత్రి మురుగుడ హనుమంతరావుకు వైసీపీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. ఇప్పుడు గంజి చిరంజీవితో కొంత కాలంగా వైసీపీ టచ్ లో ఉందని తెలుస్తోంది. ఆయన టీడీపీలో ఉన్న సమయం నుంచే వైసీపీకి కోవర్టుగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ నేతలతో సఖ్యతగా ఉండటంతో..టీడీపీ అధినాయకత్వం ఈ విషయాన్ని గ్రహించింది. తాజాగా.. ప‌ద్మ‌శాలీ కార్పొరేష‌న్ చైర్‌ప‌ర్స‌న్ జింక విజయలక్ష్మి స‌హ‌కారంతో ముఖ్యమంత్రి జగన్ ను సైతం చిరంజీవి కలిసారనే ప్రచారం నియోజకవర్గంలో వినిపిస్తోంది.

సీఎంను కలిసారని ప్రచారం

సీఎంను కలిసారని ప్రచారం

వచ్చే ఎన్నికల్లో చేనేత వర్గానికి సీటు ఇస్తే పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని.. తనకు అవకాశం ఇవ్వాలని కోరారని చెబుతున్నారు. అయితే, ముఖ్యమంత్రి నుంచి మాత్రం ఎటువంటి హామీ రాలేదని విశ్వసనీయ సమాచారం. ముందుగా పార్టీలో పని చేయాలని మాత్రమే సూచించారని చెబుతున్నారు. గంజి చిరంజీవి సతీమణి కాపు వర్గానికి చెందిన వారు. నియోజకవర్గంలో ఎక్కువగా ఉండే చేనేత- కాపు వర్గాల నుంచి మద్దతు కూడగడితే గెలుపు ఖాయమనే లెక్కలను వైసీపీ ముఖ్యుల ముందు చిరంజీవి ఉంచారని చెబుతున్నారు. దీంతో..టీడీపీలో ఉన్నా.. తనకు టికెట్ దక్కే అవకాశం లేదనే అభిప్రాయానికి చిరంజీవి వచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ ముఖ్యనేతల నుంచి పార్టీలో పని చేస్తే..ఎన్నికల సమయంలో టిక్కెట్ గురించి ప్రాధాన్యత ఇస్తామనే సూచనతో ఆయన వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారని సన్నిహితులు చెబుతున్నారు.

Recommended Video

ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంటే *Politics | Telugu OneIndia
టీడీపీలో వైసీపీ కోవర్టుగా పని చేశారంటూ

టీడీపీలో వైసీపీ కోవర్టుగా పని చేశారంటూ

అయితే, ఇప్పటి దాకా నియోజకవర్గంలో టీడీపీకి ముఖ్య వ్యక్తిగా పని చేసిన చిరంజీవి.. సడన్ గా పార్టీ మారాలనే నిర్ణయం పైన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ, ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని.. ఇందులో చిరంజీవి టీడీపీలోనే ఉంటూ వైసీపీలోకి వెళ్లేందుకు చాలా రోజులుగా రూట్ క్లియర్ చేసుకున్నారని తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు వైసీపీలోనూ మంగళగిరి సీటు కోసం పోటీ మొదలైంది. మరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటారా ఉండరా అనే క్లారిటీ రావాల్సి ఉంది. దీంతో..ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేసే లోకేష్ ను ఈ సారి వైసీపీ నుంచి ఎవరు ఢీ కొంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది. అటు ప్రత్యర్థి ఎవరైనా సరే మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్‌‌ గెలిచి తీరుతారని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

English summary
Ganji Chiranjeevi Resigned for TDP may be joined in YSRCP. TDP leaders allegate Chiranjeevi worked as YSRCP covert.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X