జెఎఫ్‌సిపై ట్విస్టిచ్చిన బాబు: అందుకే ప్యాకేజీకి ఒప్పుకొన్నా, జగన్ అప్పుడేం చేశారు?

Posted By:
Subscribe to Oneindia Telugu
  YSRCP MPs Will Resign on April 6th, Chandrababu Reaction

  అమరావతి: ప్రత్యేక హోదా విషయమై ఆందోళన చేయాలని వైసీపీ తీసుకొన్న నిర్ణయం అవకాశవాద రాజకీయమని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని వైసీపీ ఎందుకు ప్రస్తావించలేదని టిడిపి నేతలు ప్రశ్నించారు.

  పవన్ కళ్యాణ్ దూకుడు: జెఎఫ్‌సి లోగో విడుదల, ప్రత్యేక హోదానే అస్త్రం

  మంగళవారం నాడు టిడిపి కోర్‌కమిటీ సమావేశం అమరావతిలో జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు.రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై పోరాటం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.

  పవన్‌వి టైంపాస్ రాజకీయాలు, ఉండవల్లి రిటైర్డ్ టీచర్, జెపి విఫలనేత: కత్తి మహేష్ సంచలనం

  మరో వైపు వైసీపీ ఇప్పడు ప్రత్యేక హోదా అంశంపై ఆందోళనలు చేయాలని నిర్ణయం తీసుకోవడం రాజకీయ అవకాశవాదమని టిడిపి అభిప్రాయపడుతోంది.కేంద్రం నుండి నిధుల కోసం పోరాటం కొనసాగించాలని నిర్ణయం తీసుకొన్నారు.

  'బడ్జెట్‌పై బాబు ఎందుకు నోరు తెరవలేదు', 'హోదాను ఆయనే వదిలేశారు'

   పవన్ కళ్యాణ్‌ జెఎఫ్‌పిపై ఇలా..

  పవన్ కళ్యాణ్‌ జెఎఫ్‌పిపై ఇలా..

  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ విషయమై వ్యతిరేకంగాను, అనుకూలంగాను మాట్లాడకూడదని కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. జెఎఫ్‌సి అంశంపై కూడ చర్చించారు. అయితే కేంద్రం నుండి రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన నిధులు, కేంద్రం ఇచ్చానని చెబుతున్న నిధుల విషయమై జెఎఫ్‌సి కమిటీ వాస్తవాలను తేల్చాలని నిర్ణయం తీసుకొంది. అయితే ఈ కమిటీ 14 పేజీల చంద్రబాబు నివేదిక, 27 పేజీల బిజెపి నివేదిక,ను చూస్తే విషయం అర్ధమౌతోందని నేతలు అభిప్రాయపడ్డారు. అయితే ఈ కమిటీ విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.

  కేసుల కోసమే వైసీపీ డ్రామాలు

  కేసుల కోసమే వైసీపీ డ్రామాలు

  రాష్ట్ర ప్రయోజనాల కంటే వైసీపీ చీఫ్ జగన్‌పై ఉన్న కేసులను ఉపసంహరింపజేసుకొనేందుకే ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌లోకి మోడీ రాగానే వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌ నుండి బయటకు వెళ్ళిన విషయాన్ని కొందరు పార్టీ నేతలు బాబు దృష్టికి తీసుకెళ్ళారు.ప్రత్యేక హోదా విషయమై మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలో ధర్నాలు చేయాలని నిర్ణయం తీసుకోవడం రాజకీయ అవకాశవాదంగా టిడిపి నేతలు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు.కేసుల నుంచి బయటపడేందుకే వైసీపీ హోదా నినాదం ఎత్తుకుందన్నారు.

   ఎన్డీఏకు మద్దతిచ్చినప్పుడు ఏం చేశారు

  ఎన్డీఏకు మద్దతిచ్చినప్పుడు ఏం చేశారు

  రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఎన్డీఏకు వైసీపీ మద్దతిచ్చిందని, ఆనాడు ప్రత్యేక హోదా విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ఈ సమావేశంలో చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. రాష్ట్రప ప్రయోజనాలపై వైసీపీకి చిత్తశుద్ది లేదని చంద్రబాబునాయుడు వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవకాశం ఉన్న సమయంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా రాజకీయం కోసం మళ్ళీ ప్రత్యేక హోదా నినాదాన్ని ఎత్తుకొన్నారని బాబు అభిప్రాయపడ్డారు.

   ప్రత్యేక ప్యాకేజీకి అందుకే ఒప్పుకొన్నాం

  ప్రత్యేక ప్యాకేజీకి అందుకే ఒప్పుకొన్నాం

  రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో ఒనగూరే ప్రయోజనాలను ప్రత్యేక ప్యాకేజీతో కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం హమీ ఇవ్వడంతోనే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొన్నామని చంద్రబాబునాయుడు కోర్‌కమిటీ సమావేశంలో నేతలకు చెప్పారు.ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఇచ్చిన హమీలను కూడ అమలు చేయకపోవడం వల్లే నిరసనలు చేయాల్సి వస్తోందని బాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Tdp chief Chandrababu Naidu made allegations on Ysrcp chief Ys Jagan on Tuesday. what is the reason for ysrcp special status protest asked Chandrababu naidu.TDP core committtee meeting held at Amaravathi on Tuesday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి