వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోము వీర్రాజు రాజకీయ వైరాగ్యం వెనుక మతలబు అదేనా? ఏపీలో హాట్ డిబేట్

|
Google Oneindia TeluguNews

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. 2024 ఎన్నికల తరువాత రాజకీయాలలో ఉండనని సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో దుమారంగా మారాయి. సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యల వెనుక, 2024 తర్వాత తాను రాజకీయాల్లో కొనసాగేది లేదని చేసిన ప్రకటన వెనుక ప్రజల సానుభూతి కోసం సోము వీర్రాజు ప్రయత్నిస్తున్నారు అన్న చర్చ కొనసాగుతోంది.

2024 ఎన్నికల తర్వాత సోము వీర్రాజు ఆ పని చేస్తారట; జగన్ సర్కార్ కు పోలవరంపై సవాల్2024 ఎన్నికల తర్వాత సోము వీర్రాజు ఆ పని చేస్తారట; జగన్ సర్కార్ కు పోలవరంపై సవాల్

 2024 తర్వాత రాజకీయాల్లో ఉండబోనన్న సోము వీర్రాజు

2024 తర్వాత రాజకీయాల్లో ఉండబోనన్న సోము వీర్రాజు

మంగళవారం నాడు సోము వీర్రాజు తాను బీజేపీని నమ్ముకుని ఉన్నానని, గతంలో చంద్రబాబు తనకు రాజమండ్రి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ ఇచ్చినా , మంత్రి పదవి ఇస్తానని చెప్పినా తాను బిజెపిని వదిలి పోలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు రాష్ట్రంలో పరిపాలించే అధికారం ఒక్క బీజేపీకే ఉందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ సోము వీర్రాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంతకాలం రాజకీయాల్లో ఉన్న తాను బిజెపికి కట్టుబడి ఉన్నానని 2024 ఎన్నికల తరువాత తాను రాజకీయాల్లో ఉండబోనని రిటైర్మెంట్ తీసుకుంటా అని తేల్చిచెప్పారు.

 ప్రజల సానుభూతి కోసం చేసిన వ్యాఖ్యలని చర్చ

ప్రజల సానుభూతి కోసం చేసిన వ్యాఖ్యలని చర్చ

అయితే సోము వీర్రాజు ప్రజల సానుభూతి కోసం ఈ తరహా వ్యాఖ్యలు చేశారన్న చర్చ జరుగుతుంది. సొంత పార్టీలోనే సోము వీర్రాజు రిటైర్మెంట్ వ్యాఖ్యలపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే సోము వీర్రాజు, ప్రజల సానుభూతి కోసం ఈ ప్రకటన చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇదే సమయంలో బీజేపీ అధిష్టానం సోము వీర్రాజుకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న చర్చ కూడా జరుగుతోంది.

బీజేపీ అధిష్టానం సోము వీర్రాజుకు ప్రాధాన్యత ఇవ్వటం లేదన్న చర్చ

బీజేపీ అధిష్టానం సోము వీర్రాజుకు ప్రాధాన్యత ఇవ్వటం లేదన్న చర్చ

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉండి అధికార పార్టీపై సోము వీర్రాజు గట్టిగా పోరాటం చేయడం లేదని, వైసిపికి మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయనకు మాత్రమే నిర్ణయాలు తీసుకునే అధికారం లేకుండా కోర్ కమిటీని ఏర్పాటు చేసింది హైకమాండ్. దీంతో సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బలమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని సమాచారం. ఈ క్రమంలోనే తీవ్రమైన ఫ్రస్టేషన్లో ఉన్న సోము వీర్రాజు రాజకీయాలనుండి వైదొలుగుతానని చెప్పారు అన్న చర్చ కూడా సాగుతుంది.

పదవి విషయంలో సోము వీర్రాజు అభద్రతా భావం

పదవి విషయంలో సోము వీర్రాజు అభద్రతా భావం


ఇక మరో టాక్ కూడా వినిపిస్తుంది. సోము వీర్రాజు కు టిడిపి కారణంగా వచ్చిన ఎమ్మెల్సీ పదవి కాలం పూర్తయింది. ఇక ఇప్పుడు కొత్తగా ఆయనకు మరో పదవి వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. బిజెపి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నిర్ణయాధికారం లేని అధ్యక్షుడిగా సోము వీర్రాజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టాక్ . పదవి విషయంలో సోము వీర్రాజు అభద్రతా భావంలో ఉన్నారు.ఇక ఈ క్రమంలోనే సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చకు కారణం గా మారాయి.

Recommended Video

Tirupati Bypoll : Vijay Sai Reddy కి బిజేపి స్ట్రాంగ్ కౌంటర్ !
సోము వీర్రాజు రాజకీయ వైరాగ్యం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్

సోము వీర్రాజు రాజకీయ వైరాగ్యం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్

బిజెపి లో ఉన్న సోము వీర్రాజు ప్రత్యర్థి వర్గానికి ఇటీవల కాలంలో అధిష్టానం బాగా ప్రాధాన్యతనిస్తున్న పరిస్థితి ఉందని, ఇక ఇదంతా సోము వీర్రాజు అసహనానికి కారణంగా మారిందని అంటున్నారు.అందుకే ఈ విధంగా రాజకీయ వైరాగ్యాన్ని సోము వీర్రాజు ప్రదర్శిస్తున్నారని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఊహించని విధంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు 2024 ఎన్నికల తరువాత తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానని చేసిన వ్యాఖ్యలు అటు బిజెపి లోనూ , ఇటు ప్రత్యర్ధి పార్టీల లోనూ హాట్ టాపిక్ గా మారాయి.

English summary
Somu Veerraju remarks that he will not be in politics after the 2024 elections have now become a hot topic in AP. The debate continues that Somu Veerraju is trying for public sympathy , and also a talk that has no preference in the BJP. 2024
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X