"జగన్‌కేనా.. ఆ అర్హత నాకు లేదా?, కార్యకర్తలతో అందుకే అలా!, బాబుతో టచ్ లేదు"

Subscribe to Oneindia Telugu

విజయవాడ: అనూహ్యంగా పార్టీని వీడి వైసీపీకి షాక్ ఇచ్చిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి జగన్‌కు గట్టి కౌంటర్సే ఇస్తున్నారు. వ్యక్తిగతంగా ఇప్పటికీ ఆయనంటే గౌరవం ఉందని చెబుతూనే.. పార్టీలో తనకు ఎదురైన పరిస్థితులు, ప్రస్తుతం తనను ఇబ్బందులకు గురిచేస్తున్న తీరుపై ఆమె గట్టిగానే జవాబిస్తున్నారు.

ప్రధానంగా తనకు సంబంధించిన ఓ వీడియో బయటకు రావడం.. అందులో టీడీపీ నేతలతో డీలింగ్ కుదిరినట్లుగా కార్యకర్తలతో చెప్పడం వంటి అంశాలపై ఓ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో ఆమె స్పందించారు. ఈ సందర్భంగా అసలు కార్యకర్తలతో తానేమి మాట్లాడింది?.. ఎందుకలా మాట్లాడాల్సి వచ్చింది? అన్న విషయాలను వివరించారు.

జగన్‌కేనా.. ఆ అర్హత మాకు లేదా?:

జగన్‌కేనా.. ఆ అర్హత మాకు లేదా?:

టీడీపీలోకి వెళ్లడానికి రూ.25కోట్ల ఆఫర్ అంగీకరించారని అందుకే పార్టీ
మారారన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని గిడ్డి ఈశ్వరి స్పష్టం చేశారు. అయితే మంత్రి పదవి గురించి మాట్లాడిన మాటలు మాత్రం వాస్తవమేనని.. తనది కష్టపడే తత్వం కాబట్టి మంత్రి పదవి కోరుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు.

జగన్ వైసీపీ పార్టీ పెట్టి సీఎం అవాలని కోరుకోవడంలో తప్పు లేదు కానీ ఓ గిరిజన మహిళగా, కష్టించి పనిచేసే నేతగా తాను మంత్రి పదవి కోరుకోవడంలో తప్పేముందన్నారు.

అందుకే అలా చెప్పాను:

అందుకే అలా చెప్పాను:

మంత్రి పదవికి గురించి కార్యకర్తల సమాలోచనలో ఎందుకు చర్చ చేయాల్సి వచ్చిందో ఈశ్వరి వివరించారు. వాస్తవానికి తాను ఎలాంటి షరతులు(అన్ కండిషనల్) లేకుండానే పార్టీలోకి వచ్చానని, మంత్రి గురించి భరోసా ఏమి లేదని అన్నారు. అయితే కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి కాబట్టి.. తాను మంత్రి పదవి గురించి ప్రస్తావించాల్సి వచ్చిందన్నారు.

ఒక్క బాక్సైట్ తవ్వకాల విషయంలో మాత్రమే తాను చంద్రబాబుకు షరతు విధించినట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలంతా తనను అమ్మగా.. నాయకురాలిగా.. గౌరవిస్తారని, వారి గౌరవాన్ని నిలుపుకుంటూ వారి కోసం పనిచేస్తున్నానని అన్నారు. అలాంటప్పుడు మంత్రి పదవి ఆశించడంలో తప్పేమి లేదన్నారు.

బాబుతో టచ్ లేదు:

బాబుతో టచ్ లేదు:

నిజానికి టీడీపీలోకి చేరడం కన్నా ముందు.. మునుపెన్నడూ తాను సీఎం చంద్రబాబుతో మాట్లాడింది లేదన్నారు. అయితే తాను పార్టీలో చేరుతానని కబురు పెట్టగానే అంతా సిద్దం చేసి తనను పిలిచారని అన్నారు. తాను సీఎం కార్యాలయానికి వెళ్లగానే.. అప్పటికే విశాఖ నేతలందరిని పిలిపించారని, వారిని పరిచయం చేసుకోవాల్సిందిగా చెప్పారని వివరించారు. విశాఖ నేతలతో పరిచయాలు ఉన్నాయని చెప్పడంతో.. నేరుగా కార్యక్రమం వద్దకు వెళ్లామన్నారు.

విజయసాయిని కలిశాను:

విజయసాయిని కలిశాను:

పార్టీ మారడం కన్నా ముందు రోజు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇంటికెళ్లానని ఈశ్వరి తెలిపారు. మంత్రి పదవి కోసం వెళ్లొద్దమ్మా.. అంటూ ఆయన మాట్లాడారని, పదవి ఆశించి తాను వెళ్లడం లేదని ఆయనకు స్పష్టం చేసినట్లుగా చెప్పుకొచ్చారు. వైసీపీలో తనకెదురైన ఇబ్బందికర పరిస్థితుల వల్లే పార్టీని వీడాల్సి వచ్చిందని ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP Leader Giddi Eswari questioned YSRCP that what is the wrong if she expects ministry

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి