ఆమ్రపాలి ఔట్, వారితో సహ - ఏపీలో కీలక బాధ్యతలు ఫిక్స్..!!
కేంద్ర డీఓపీటీ సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఐఏఎస్‌లు తెలంగాణకు వెళ్లాల్సిందిగా సూచించింది. తెలుగు రాష్ట్రాల మధ్యన ఏఐఎస్ అధికారుల సర్దుబాటు పైన నిర్ణయం ప్రకటించింది. 16వ తేదీలోగా రిపోర్ట్ చేయాలంటూ స్పష్టం చేసింది. అదే విధంగా తెలంగాణకు వస్తామన్న రావత్, అనంతరాములుకు నో చెప్పింది. దీంతో, ఇప్పుడు ఈ అధికారులు ఏం చేయబోతున్నారు. చంద్రబాబు, రేవంత్ నెక్స్ట్ స్టెప్ ఏంటి.
డీఓపీటీ ఆదేశాలతో
తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తున్న అయిదుగురు ఐఏఎస్ అధికారులు..ఇద్దరు ఐపీఎస్ లను కేంద్రం సంచలన ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో తీసుకున్న నిర్ణయం మేరకు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో పని చేయని అధికారులు తక్షణం అక్కడకు వెళ్లాలని ఆదేశించింది. రెండు రాష్ట్రాల్లో కేటాయింపులకు విరుద్దంగా పని చేస్తున్న అధికారులు ఈ నెల 16వ తేదీ లోగా సొంత కేడర్ రాష్ట్రంలో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది. దీంతో, తెలంగాణలో పని చేస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలీ, రొనాల్డ్ రోస్, మల్లెల ప్రశాంతి, వాణీ ప్రసాద్, వాకాటి అరుణ తో పాటుగా ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష బిస్త్ ఏపీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది.

ఏపీలో రిపోర్ట్
అదే విధంగా ఏపీలో పని చేస్తున్న తెలంగాణ అధికారులు రిలీవ్ కావాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం విజయవాడ కలెక్టర్ గా ఉన్న కె.సృజన, కడప కలెక్టర్ శివశంకర్ లోతేటి, ఏపీ ప్రజారోగ్య శాఖ కమిషనర్ సీహెచ్ హరికిరణ్ తెలంగాణకు వెళ్లాల్సి ఉంది . కాగా, తమను తెలంగాణకు కేటాయించాలన్న ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులు ఎస్‌ఎస్ రావత్, అనంతరాము విజ్ఞాపనను డీవోపీటీ తిరస్కరించింది. కేంద్రం తాజా ఆదేశాలతో ఇప్పుడు ఈ అధికారులు తమ కేడర్ రాష్ట్రంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈ అధికారులను రిలీవ్ చేసే విషయం లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆలోచన ఏంటనేది కీలకంగా మారుతోంది.
అమ్రపాలీ పోస్టింగ్
అధికారులను రిలీవ్ చేయటానికి సమయం కోరుతారా..లేక వెంటనే ఆదేశాలు అమయ్యేలా నిర్ణయం తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న అమ్రపాలి తెలంగాణకు వచ్చిన తరువాత సీఎం రేవంత్ ఏరి కోరి జీహెచ్ఎంసీ కమిషనర్ గా నియమించారు. ఇప్పుడు అమ్రపాలీని తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసి ఏపీ ప్రభుత్వంలో జాయిన్ అయితే దక్కే పోస్టింగ్ పైన చర్చ మొదలైంది. అమ్రపాలీని కీలకమైన విశాఖ నగర పాలక కమిషనర్ గా నియమించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో డీఏపీటీ ఆదేశాల పైన ఎలా ముందుకు వెళ్లాలనేది అదేశాలు అందుకున్న అధికారులు సైతం తర్జన భర్జన పడుతున్నారు. ఈ రోజు సీఎస్ తో సమావేశం కానున్నారు. ఈ సాయంత్రానికి వీరి విషయంలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications