వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ ఏంచేస్తారు?: సస్పెన్స్, జనసేన వైపు పార్టీల దృష్టి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీని స్థాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పార్టీ నిర్మాణంపై దృష్టి సారించారు. పవన్ ఏం చేసేది మరో నాలుగైదు రోజుల్లో నిర్ణయించుకోబోతున్నారి సమాచారం. పార్టీని నిర్మించుకునే పనిలో పవన్ పడ్డారు. పార్టీలో జోకర్లకు, జంపర్స్‌కు స్థానం లేదని పవన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఎవరిని పార్టీలోకి తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

రానున్న ఎన్నికల్లో పోటీ చేసేది లేదని చెప్పలేమని పవన్ చెప్పారు. ఈ నేపథ్యంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ ఆయన పార్టీ పోటీ చేస్తుందా లేక ఎవరికైనా మద్దతుకే పరిమితం అవుతుందా అనేది త్వరలో తేలనుంది. అయితే, గెలుపుకు ఆస్కారం ఉన్న పలు స్థానాల్లో పోటీ చేసే అవకాశముంది.

Pawan Kalyan

ఇప్పటికే పోటీ విషయమై దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే, పవన్ స్వయంగా పోటీ చేస్తారా లేదా అనేది సస్పెన్స్‌గా ఉంది. కాంగ్రెసు మినహా మిగిలిన అన్ని పార్టీలతో పొత్తులపై చర్చించేందుకు సిద్ధమని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన వైపు ఇతర పార్టీలు సూచిస్తున్నాయి. పవన్ తమతో కలిస్తే తిరుగు ఉండదని పలు పార్టీలు భావిస్తున్నాయి.

జనసేన ఎన్నికల్లో పొత్తు చేయకపోయినా లేదా కొద్ది స్థానాల్లో పోటీ చేసినా పొత్తు కోసం తెలుగుదేశం, బిజెపి వంటి పార్టీలు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, పొత్తులపై పవన్ స్వయంగా పెదవి విప్పితే గానీ ఏం తెలియదు. అప్పటి వరకు అది సస్పెన్స్‌గానే ఉండనుంది.

English summary
"Pawan Kalyan has become busy in building the party organisation. Jana Sena is receiving unprecedent number of calls to join the party."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X