ఆ 8గంటలు.. అసలే మావోయిస్టు ప్రాబల్యం, గిడ్డి ఈశ్వరి ఆచూకీపై హైటెన్షన్?

Subscribe to Oneindia Telugu
  8 గంటల పాటు తెలియని గిడ్డి ఈశ్వరి ఆచూకీ...పోలీసులకు టెన్షన్

  విశాఖపట్నం: పోలీసులు వద్దంటున్నా వినకుండా.. ఏజెన్సీ గ్రామాల్లో పర్యటనకు వెళ్లిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆచూకీ 8గంటల పాటు తెలియరాలేదు. దీంతో ఆమె ఆచూకీపై తీవ్ర ఉత్కంఠ కొనసాగింది.

  దళిత తేజం కార్యక్రమంలో భాగంగా మొదట ఆమె గూడెంకొత్తవీధి మండలం ఆర్వీనగర్‌లో పర్యటించారు. అనంతరం మండలకేంద్రం నుంచి సప్పర్ల, ధారకొండ, దుప్పిలవాడ పంచాయతీల్లో పర్యటించడానికి బయల్దేరారు.

  when information is missing: police worried about giddi eswari

  ఆ సమయంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఆ ప్రాంతాలు మావోయిస్టు ప్రాబల్యం ఉన్నవి కావడంతో పర్యటన వద్దని తెలిపారు. అయినా సరే, గిడ్డి ఈశ్వరి వినలేదు. పర్యటన కోసం గాలికొండ బయల్దేరి వెళ్లారు.

  ఆపై చీకటి పడినా ఆమె ఆచూకీపై ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో పోలీస్ అధికారులు తీవ్ర టెన్షన్ కు లోనయ్యారు. ఎట్టకేలకు రాత్రి 10గం. సమయంలో ఎమ్మెల్యే ధారకొండకు చేరుకున్నారన్న సమాచారంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఎమ్మెల్యే ఈశ్వరి మిస్సింగ్‌పై ఉత్కంఠకు తెరపడింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  On Thursday, Paderu MLA Giddi Eswari went to visit agency villages in her constituency. But police were objected her

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X