వినాయక చవితి 18,19 తేదీల్లో ఏ రోజు - కాణిపాకం ఆలయం, పండితుల క్లారిటీ..!!

ప్రతీ ఒక్కరు భక్తి శ్రద్దలతో చేసుకొనే పండుగ వినాయక చవితి. ఈ ఏడాది వినాయక చవితి పండుగ తేదీ సందిగ్ధంలోనే పడింది. ఈ నెల 18 లేదా 19 తేదీల్లో ఎప్పుడు జరుపుకొనాలనే డైలమా కొనసాగుతోంది. చవితి తిధి 18, 19 తేదీల్లో రెండు రోజుల్లోనూ ఉంటుంది. దీంతో పండుగ నిర్వహణ పైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం స్పష్టత ఇచ్చింది. అదే సమయంలో సిద్దాంతులతో కూడిన విద్వత్ సభ పండుగ నిర్వహణ పైన సందిగ్ధతకు తెర దించింది.

రెండు రోజుల్లో ఎప్పుడు:ప్రతీ ఏటా భాద్రపద శుద్ద చవితి నాడు వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. ఈసారి 18వ తేదీ ఉదయం 9 గంటల 58 నిమిషాలకు చవితి ప్రారంభమై 19వ తేదీ ఉదయం 10 గంటలా 28 నిమిషాలకు ముగుస్తుంది. ఈ లెక్కన చతుర్థశి 18, 19 రెండురోజులూ ఉంటుంది.

When is Ganesh Chaturthi, 18th or 19th: date and puja,significance details here

దీంతో చవితి పండగ ఏరోజు జరుపుకోవాలన్న సందేహం మొదలైంది. దీనిపై వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రంలో నెలరోజుల కిందటే 100 మంది సిద్ధాంతులతో చర్చించి వినాయక చవితి తేదీపై నిర్ణయం తీసుకుంది విద్వత్ సభ. ఇదే విషయాన్ని తెలంగాణా ప్రభుత్వానికి నివేదించింది. గవర్నమెంట్ సెలవుల జాబితాలో ఇప్పటికే 18వ తేదీని అఫీషియల్ హాలిడేగా ప్రకటించింది.

18నే అంటున్న కాణిపాకం ఆలయం:మరోవైపు వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయకుడి దేవస్థానం కూడా క్లారిటీ ఇచ్చింది. చవితి తిథి ఈ నెల 18నే అంటోంది.. అందుకే ఆ రోజే కాణిపాకం దేవస్థానం వినాయక చవితి జరుపుతోంది.

ఈ‌ సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి 18వ తేదీ సోమవారం నాడు ఉదయం 10-15 నిమిషాలు నుంచి మరుసటి రోజు ఉదయం 10-43 నిమిషాలు వరుకూ ఉంటుందని వివరించారు. అంటే 18వ తేదీ రోజు రాత్రి మాత్రమే చవితి తిథి ఉంది. దీంతో, ఆతిథి ప్రాకారం కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. ఈ నెల 18వ తేదీ నుంచి 21 రోజుల పాటు కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు.

When is Ganesh Chaturthi, 18th or 19th: date and puja,significance details here

18వ తేదీ నుంచి ఉత్సవాలు:వినాయకచవితి పండుగను ఈ నెల 18న సోమవారం రోజునే జరుపుకోవాలని తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యుడు, ఆగమ పండితుడు వేదాంతం విష్ణుభట్టాచార్యులు తెలిపారు.

2000, 2009, 2010, 2019 సంవత్సరాల్లో కూడా ఇటువంటి సందిగ్ధ పరిస్థితే వచ్చినపుడు తదియతో కూడిన చతుర్ధినే పర్వదినంగా జరుపుకోవాలని నిర్ణయించారని గుర్తు చేశారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సైతం వినాయక చవితి ఎప్పుడనేది తేల్చింది. 18న వినాయక చవితి జరుపుకోవాలని నిర్ణయించింది. అదే విధంగా ఈ నెల 28న వినాయక నిమజ్జనం తేదీగా ఖరారు చేసింది. గతంలో 19వ తేదీగా నిర్ణయించినా, పీఠాధిపతులతో చర్చల తరువాత 18వ తేదీనే నిర్వహణకు నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+