వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్ర‌బాబుతో ''ట‌చ్'' లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు??

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మరానికి స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ''ముంద‌స్తు'' ఆలోచ‌న చేస్తున్న ప్ర‌భుత్వాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని పార్టీలు తాము కూడా స‌మాయ‌త్త‌మ‌వుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఎక్కువ‌మందిపై తీవ్ర వ్య‌తిరేక‌త వస్తోందంటూ ''ఐప్యాక్'' కు చెందిన రుషిరాజ్ సింగ్ నివేదిక ఇవ్వ‌డంతో వారిని మార్చ‌డానికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు టచ్ లోకి వెళుతున్నారని తెలుస్తోంది.

ఈసారి సీటు రాదని అర్థం కావడంతో..

ఈసారి సీటు రాదని అర్థం కావడంతో..


రానున్న ఎన్నిక‌ల్లో త‌మ‌కు సీటురాద‌ని అర్థం చేసుకుంటున్న ప‌లువురు వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీతో ట‌చ్‌లోకి వెళుతున్న‌ట్లు వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే వారికి సీటు ల‌భిస్తుంద‌నే హామీ మాత్రం పార్టీ అధినేత నుంచి రావ‌డంలేద‌ని సమాచారం. ప్ర‌భుత్వ ప‌రంగా ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ నిధులు విడుద‌ల చేయ‌క‌పోతుండ‌టంతో నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ‌కు శాపంగా మారుతోంద‌ని, అభివృద్ధి ప‌నులు లేక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తోందంటూ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. దీనివ‌ల్ల రాబోయే ఎన్నిక‌ల్లో త‌మ గెలుపు అవ‌కాశాలు క్లిష్ట‌మ‌వుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 నియోజకవర్గానికి రూ.12 కోట్లివ్వాలని నిర్ణయం

నియోజకవర్గానికి రూ.12 కోట్లివ్వాలని నిర్ణయం

ఈ అంశాల‌ను దృష్టిలో ఉంచుకొని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నియోజ‌క‌వ‌ర్గానికి రూ.12 కోట్ల చొప్పున విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. ప్ర‌స్తుతానికి నిధుల విడుద‌ల పెండింగ్‌లో ఉంది. ఇటీవ‌లే ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో ట‌చ్‌లోకి వెళ్లారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు అవ‌కాశం ఉండ‌టంతో తెలుగుదేశం పార్టీ ఇప్ప‌టినుంచే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసుకుంటూ వ‌స్తోంది. గ‌తంలోలా నాన్చుడు ధోర‌ణి కాకుండా ముందుగానే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే ప్ర‌క్రియ‌కు తెర‌తీసింది. దీంతో తమకు ఈసారి సీటు రాదనే అనుమానం ఉన్నవారు తెలుగుదేశం కొలనులో ఒక రాయివేసి చూస్తున్నారంటున్నారు.

హామీ ఇవ్వని చంద్రబాబు

హామీ ఇవ్వని చంద్రబాబు


ఈక్ర‌మంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్న‌ప్ప‌టికీ వారికి సీటిస్తామనే హామీని చంద్ర‌బాబు ఇవ్వ‌లేక‌పోతున్నారు. ఒక‌వేళ వారికి సీటు ఇస్తే అదే నియోజ‌క‌వ‌ర్గంలో వారిపై ఉన్న వ్య‌తిరేక‌త, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కలిపి టీడీపీపై మ‌ళ్లుతుంద‌ని, దీనివ‌ల్ల అంతిమంగా న‌ష్ట‌పోతామ‌ని బాబు భావిస్తున్నారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. అయితే ట‌చ్ లో ఉన్న ఎమ్మెల్యేల్లో ఎవ‌రికైనా వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో మంచి పేరు ఉంటే ఒక‌సారి ప‌రిశీలించే అవ‌కాశం లేక‌పోలేద‌నే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. ముఖ్య‌మంత్రి ఇంటిలిజెన్స్ నిఘా నుంచి త‌ప్పించుకొని మ‌రీ చంద్ర‌బాబుతో ట‌చ్ లో ఉన్న‌వారెవ‌రా ? అనేది ఇప్పుడు వైసీపీ, టీడీపీ రెండు పార్టీల్లోను చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వారెవరనేది కొద్దిరోజుల్లోనే స్పష్టత రావచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

English summary
YCP MLAs in touch with Telugu Desam Party chief Chandrababu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X