అశోక్‌బాబు వెనుక ఎవరు? హరికి జగన్ దెబ్బ: విహెచ్

సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు ఢిల్లీలో విభజన ప్రక్రియను ఆపే ప్రయత్నాలు మాని వారి వారి నియోజకవర్గాలకు వెళ్లి వచ్చే ఎన్నికలలో ఎలా గెలవాలో ఆలోచించాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు పెద్ద నేతలు అని వారిని కాదని ఈ అశోక్ ఎవరన్నారు.
ఆయన వెనుక ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. విభజనకు అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని ఆ తర్వాతే తమ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. రోడ్డు మ్యాప్ ప్రకటించాక కొందరు యూ టర్న్ తీసుకోవడం సరికాదన్నారు. యాభై రోజులుగా సీమాంధ్రలో ఉద్యమం నడుస్తుంటే కేసులు, ఉద్యమాన్ని అణిచి వేసే ప్రయత్నాలు ఏవని ప్రశ్నించారు.
తాము దశాబ్దాలుగా ఇబ్బందులు పడ్డామని, తమ పాలన తాము చూసుకుంటామన్నారు. తెలంగాణలో తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఇతర పార్టీలను ఎలా అడ్డుకోవాలో తాము చూసుకుంటామని, తాము చెప్పినట్లుగా పదిహేను పార్లమెంటు స్థానాలలో గెలుస్తామన్నారు.
తెలంగాణ అంశాన్ని మొదట ఎత్తుకుంది తమ పార్టీయేనని, దానిని కెసిఆర్ హైజాక్ చేశారన్నారు. తెలంగాణలో ఎలా గెలవాలో తాము చూసుకుంటామని చెప్పారు. జగన్‌కు ఇన్నాళ్లు కుడి భుజంగా ఉన్న అనకాపల్లి ఎంపి సబ్బం హరికి ఆ పార్టీ దెబ్బ కొట్టిందని, కాంగ్రెసు పార్టీ మాత్రం ఆలా కాదన్నారు.
ప్రాంతీయ పార్టీలు పార్టీని నిలబెట్టుకనేందుకు ఎన్నో చెబుతాయని, తమది జాతీయ పార్టీ కాబట్టి అలా చెప్పదన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఇరు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని మాట్లాడటం సరికాదన్నారు. ఉద్యమం ప్రజాప్రతినిధుల చేతుల్లో లేనట్లుగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications