జగన్ భక్తిలో మునిగిపోతున్న డీజీపీ; ఏపీలో ఆ డ్రగ్స్ డాన్ ఎవరు ? నారా లోకేష్ సంచలన ట్వీట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారాన్ని టీడీపీ విడిచిపెట్టటం లేదు. ఏపీలో ఆ డ్రగ్స్ డాన్ ఎవరు ? ఆ బిగ్ బాస్ ఎవరు ? ఆ డ్రగ్స్ డెన్ ఎక్కడ ? దాని వెనుక ఉంది వైసీపీ కాదా? అంటూ జగన్ సర్కార్ ను వేలెత్తి చూపుతూనే ఉన్నారు. డ్రగ్స్ మాఫియా వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారని తెలుగుదేశం పార్టీ నేతలు అధికార వైసీపీపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు . ఏకంగా సీఎం జగన్ నే టార్గెట్ చేసి మరీ ఆరోపణలు చేస్తున్నారు. జగన్ ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలని పదేపదే ప్రశ్నిస్తున్నారు.

లిక్కర్ మాఫియాతో మొదలుపెట్టి డ్రగ్స్ డెన్ గా ఏపీ

లిక్కర్ మాఫియాతో మొదలుపెట్టి డ్రగ్స్ డెన్ గా ఏపీ

తాజాగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డ్రగ్స్ మాఫియా వ్యవహారంపై ఏపీ సర్కార్ ను జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సంచలన ట్వీట్ చేశారు. గుజరాత్ లో తీగలాగితే ఏపీలో డొంక కదిలిందని పేర్కొన్నారు. 72వేల కోట్ల విలువైన డ్రగ్స్ తాలిబన్లతో మాట్లాడి ఏపీకి తెచ్చిన డాన్ ఎవరు అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. తాలిబన్ డ్రగ్స్ కి తాడేపల్లి ప్యాలెస్ కి ఉన్న లింక్ ఏంటి అని ప్రశ్నించిన నారా లోకేష్, లిక్కర్ మాఫియాతో మొదలు పెట్టి ఇప్పుడు ఏపీని ఏకంగా డ్రగ్స్ డెన్ గా మార్చేశారు అంటూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు.

ఏపీ పరువు పోతున్నా డీజీపీ తీరు అలా

ఏపీ పరువు పోతున్నా డీజీపీ తీరు అలా

అంతేకాదు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను టార్గెట్ చేసిన లోకేష్ గౌతమ్ సవాంగ్ ను ఉద్దేశించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉన్న అత్యున్నత వ్యవస్థలన్నీ ఏపీ వైపు వేలు చూపిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఇతర రాష్ట్రాలను హెచ్చరిస్తున్నాయి అని, ఇంతా జరుగుతుంటే అవేవీ పట్టనట్టు డీజీపీ గౌతమ్ సవాంగ్ మాత్రం జగన్ భక్తిలో మునిగి తేలుతున్నారు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. డ్రగ్స్ డాన్ ను కాపాడడం కోసం ప్రయత్నాలు ఆపి ఏపీ పరువు కాపాడడం కోసం శ్రద్ధ చూపించాలని నారా లోకేష్ డీజీపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

ఏపీ డ్రగ్స్ మాఫియా విషయంలో జగన్ పై విమర్శల దాడి

ఏపీ డ్రగ్స్ మాఫియా విషయంలో జగన్ పై విమర్శల దాడి

మరోవైపు తెలుగు దేశం పార్టీ నేతలు డ్రగ్స్ వ్యవహారంలో జగన్ కు పలు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. హెరాయిన్ తాలిబన్ల నుండి వచ్చింది నిజమా కాదా? సరుకు మీద ఉన్న ఆషి ట్రేడింగ్ కంపెనీ విజయవాడలో ఉందా లేదా?జిఎస్టి నెంబర్ ఉందా లేదా ?జగన్ సమాధానం చెప్పాలని, ఇక రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాపై ఏ మాత్రం విచారణ చెయ్యకుండా హెరాయిన్ వార్త వచ్చిన గంటలో నే విజయవాడ సీపీ ఏపీలో డ్రగ్స్ లేవని క్లీన్ చిట్ ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు.

కాకినాడకు చెందిన సుధాకర్ ఆషీకీ ట్రేడింగ్ కంపెనీ ఓనర్ పై, అతని భార్య పై మీ ప్రభుత్వం ఏం దర్యాప్తు చేసిందో చెప్పాలని, సుధాకర్ వెనుక ఉన్న బిగ్ బాస్ ఎవరో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.

డ్రగ్స్ డాన్ .. కింగ్ పిన్.. బిగ్ బాస్ అంటూ జగన్ ను టార్గెట్ చేస్తున్న టీడీపీ

డ్రగ్స్ డాన్ .. కింగ్ పిన్.. బిగ్ బాస్ అంటూ జగన్ ను టార్గెట్ చేస్తున్న టీడీపీ

దేశంలోనే ఏపీ అతి పెద్ద డ్రగ్స్ మాఫియాకి కేంద్రం కావటం వెనుక కింగ్ పిన్ ఎవరు, బిగ్ బాస్ ఎవరు అని జగన్ నే టార్గెట్ చేస్తున్నారు టీడీపీ నేతలు. జగన్ కు, వైసీపీ నేతలకు ఈ వ్యవహారంతో సంబంధం ఉందని, వారి కనుసన్నలలోనే డ్రగ్స్ దందా సాగుతుందని విమర్శిస్తున్నారు. ఎవరా డ్రగ్స్ డాన్ అంటూ ప్రశ్నిస్తూనే జగన్ వైపు వేలు చూపిస్తున్నారు. ఇక ఈ పరిణామాలు ఏపీ సర్కార్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. వైసీపీ నేతలు, డీజీపీ ఏపీకి డ్రగ్స్ తో సంబంధం లేదని చెప్తున్నా సరే టీడీపీ మాత్రం గుజరాత్ లో తీగ లాగితే ఏపీ డొంక కదులుతుందని వైసీపీ పాలనలో ఏపీ డ్రగ్స్ కు కేంద్రంగా మారిందని చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+