నా గురించి చెప్పేందుకు కెసిఆర్ ఎవరు: జానారెడ్డి ఫైర్
హైదరాబాద్: తాను ఓడిపోతానని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పడం ఆయన అవివేకమని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి ఆదివారం అన్నారు. తాము ప్రజల తీర్పుకు కట్టుబడి ఉంటామని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెసు పార్టీ అత్యధిక స్థానాలలో గెలుపొందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను ఓడిపోతున్నానని చెప్పడానికి కెసిఆర్ ఎవరని ప్రశ్నించారు. తన గురించి ఆయన ప్రస్తావించడం అవివేకం అనిపించుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శివరామకృష్ణన్ కమిటీపై ఆగ్రహం
విశాఖలో శివరామకృష్ణన్ కమిటీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఉత్తరంధ్ర రాజకీయ ఈరాచ సభ్యులు ఆదివారం ఆందోళన చేపట్టారు. స్థానిక మద్దెలపాలెం సెంటర్‌లో తెలుగుతల్లి విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. శివరామకృష్ణన్ కమిటీ విశాఖ వచ్చింది... కేవలం విహార యాత్రకేనని, రాజధాని అంశంపై కాదని రాజకీయ ఐకాస సభ్యుడు జెటి రామారావు ఆరోపించారు.
రామారావు మీడియాతో మాట్లాడుతూ... నగరంలో డిఆర్ఎంఓను గాని, ఇతర పెద్దలను గానీ ఈ కమిటీ కలవలేదన్నాకం. కేవలం కమిటీ విహారయాత్ర కోసం ఇక్కడికి వచ్చిందన్నారు. ఈ కమిటీకి చిత్తశుద్ధి, చట్టబద్దత లేదన్నారు. జిల్లాల మధ్య చిచ్చుపెట్టి, ప్యాకేజీల కోసం లొంగిపోయి, ప్రలోభాలకోసం లోనయ్యే అవకాశం ఉందన్నారు. ఈ కమిటీని ప్రజలు నమ్మవద్దన్నారు.












Click it and Unblock the Notifications