India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడాలి నానికి ఇన్నాళ్ల‌కు స‌రైన ప్ర‌త్య‌ర్థి దొరికారు?

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌రావు(నాని)కి ఇన్నాళ్ల‌కు స‌రైన ప్ర‌త్య‌ర్థి దొరికారనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుతోపాటు ప‌లువురు నేత‌ల‌పై దురుసుగా మాట్లాడ‌టం, అస‌భ్య ప‌ద‌జాలం ఉప‌యోగించ‌డం లాంటివ‌న్నీ చేస్తుండటంతో ఆయ‌నపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతుంటాయి. టీడీపీ నేత‌ల‌కు కంట్లో న‌లుసుగా మారిన నానిని ఈసారి ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లో ఓడిస్తామని ప్రకటనలిస్తున్న ఆ పార్టీకి ఇప్పుడు జన‌సేన పార్టీ తోడైంది.

జనసేన నుంచి నానికి తీవ్ర సెగ

జనసేన నుంచి నానికి తీవ్ర సెగ


కొడాలి నానికి జ‌న‌సేన రూపంలో ఇన్నాళ్ల‌కు స‌రైన ప్ర‌త్య‌ర్థి దొరికార‌నేది రాజ‌కీయ విశ్లేష‌కుల భావ‌న‌. ఆ పార్టీ నుంచే ఆయ‌న తీవ్ర సెగ త‌గ‌ల‌బోతోంద‌ని, చంద్ర‌బాబుపై నోరు పారేసుకుంటున్నా, అస‌భ్య ప‌ద‌జాలాన్ని ఉప‌యోగిస్తున్నా అలా మాట్లాడ‌టానికి ఇష్ట‌ప‌డని టీడీపీ నేత‌లు మౌనం వ‌హిస్తున్నారనే అభిప్రాయం అందరిలో ఉంది.
గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం మొత్తం సినిమా ప‌రంగా ప‌వ‌న్ కు అభిమానులు ఎక్కువ‌. యువ‌త‌లో మంచి క్రేజ్ ఉంది. రాబోయే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం-జ‌న‌సేన మ‌ధ్య పొత్తు పొడిస్తే ఆ సీటును జ‌న‌సేన‌కే వ‌దిలిపెట్టే అవ‌కాశాలున్నాయ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

నాని వరుసగా గెలవడానికి టీడీపీయే కారణం?

నాని వరుసగా గెలవడానికి టీడీపీయే కారణం?


గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నాని వ‌రుస‌గా గెల‌వ‌డానికి తెలుగుదేశం పార్టీయే కార‌ణం. ఒకే అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌కుండా ప్ర‌తి ఎన్నిక‌కు అభ్య‌ర్థిని మారుస్తుండ‌టం కూడా నాని విజయానికి కార‌ణ‌మ‌వుతోంది. కొన్ని సంవ‌త్స‌రాలుగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు తిరుగులేద‌ని భావిస్తున్న నానికి ఇటీవ‌లే గ‌ట్టి షాక్ త‌గిలింది. ఆయ‌న ముఖ్య అనుచ‌రులుగా ఉన్న పాలంకి సార‌ధిబాబు, పాలంకి మోహ‌న్‌బాబు కొన్నాళ్ల క్రితం జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ స‌మ‌క్షంలో పార్టీలో చేరారు. నాని ఇటీవ‌ల కాలంలో మ‌రీ శ్రుతి మించి మాట్లాడుతున్నార‌ని, అందుకే తాము పార్టీ మారుతున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఇంటిని చుట్టుముట్టినా నాని మౌనం

ఇంటిని చుట్టుముట్టినా నాని మౌనం


జ‌న‌సేన హ‌వా కొద్దిరోజులుగా గుడివాడ‌లో పెరుగుతోంది. ఇటీవ‌లే పార్టీ శ్రేణులు ర‌హ‌దారులు బాగోలేదంటూ కొడాలి ఇంటిని చుట్టుముట్టే ప్ర‌య‌త్నం చేయ‌డం తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారితీసింది. వైసీపీ ఇచ్చిన హామీలు, గుడివాడ‌లో కొడాలి నాని ఇచ్చిన హామీలు ఎంత‌మేర‌కు నెర‌వేర్చార‌నే విష‌య‌మై జ‌న‌సేన శ్రేణులు సామాజిక మాధ్య‌మాల్లో భారీగా ప్ర‌చారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీపై విరుచుకుప‌డే రీతిలో జ‌న‌సేన‌పై విరుచుకుప‌డ‌టానికి నానికి అవ‌కాశం లేకుండా పోతోందని, ఆయ‌న‌కు ఎక్కువ‌గా ఓటింగ్ జ‌రిగేది యువ‌త నుంచి, ప‌వ‌న్ అభిమానుల నుంచేన‌నే అభిప్రాయం రాజకీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను గ‌ట్టిగా విమ‌ర్శించే అవ‌కాశం ఈ మాజీ మంత్రికి క‌న‌ప‌డ‌టంలేదంటున్నారు.

జనసేనే సరైన ప్రత్యర్థి అంటున్న విశ్లేషకులు

జనసేనే సరైన ప్రత్యర్థి అంటున్న విశ్లేషకులు


గుడివాడ‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌న్నింటినీ ద‌గ్గ‌ర‌నుంచి ప‌రిశీలిస్తున్న విశ్లేష‌కులు కొడాలి నానిని జ‌న‌సేన స‌రిగానే టార్గెట్ చేసింద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. వర్షాల వల్ల వాయిదా పడిన తెలుగుదేశం పార్టీ మినీ మ‌హానాడు కూడా త్వ‌ర‌లో ఇక్క‌డే జ‌ర‌గ‌బోతోంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ని ప్రజలు చెత్త పన్నుపై కొడాలిని నిలదీయడంతో ఆయన పేర్ని నానితో కలిసి ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

మున్ముందు జ‌ర‌గ‌బోయే రాజ‌కీయ ప‌రిణామాల‌న్నింటినీ విశ్లేషిస్తున్నవారు కొడాలి నానిని జనసేన ద్వారా తెలుగుదేశం పార్టీ గట్టిగా టార్గెట్ చేసిందంటున్నారు. భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో తెలియాలంటే కొద్దిరోజు వేచిచూడాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

English summary
Political analysts feel that Kodali has found a suitable opponent in the form of Jana Sena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X