• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపి ప్రతిపక్ష నేత ఎవరు..? చంద్రబాబు ఆ బాధ్యతలు స్వీకరిస్తారా?

|

హైదరాబాద్‌/అమరావతి : ఓ ప్రహసనం ముగిసింది. ఏపిలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించడం.. ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రమాణస్వీకారానికి ఈ నెల 30న ముహుర్తం ఖరారు కావడం తెలిసిందే. అయితే ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన టీడీపీ నుంచి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరుంటారనే అంశంపై టీడీపీ వర్గాల్లో చర్చ జోరందుకుంది. ఓట్ల లెక్కింపు చివరి దశకు చేరుకున్న సమయానికి ఆ పార్టీ కేవలం 24 సీట్లకే పరిమితమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు మినహా హేమాహేమీలు ఫ్యాన్‌ సుడిగాలికి కొట్టుకుపోయారు.

పార్టీల్లో... ప్రజాశాంతీ పార్టీ వేరయా... కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా...?పార్టీల్లో... ప్రజాశాంతీ పార్టీ వేరయా... కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా...?

పని చేయని సుధీర్ఘ అనుభవం..! బాబు మరో ఐదేళ్లు ప్రతిపక్షానికే..!!

పని చేయని సుధీర్ఘ అనుభవం..! బాబు మరో ఐదేళ్లు ప్రతిపక్షానికే..!!

సుధీర్ఘ రాజకీయ అనుభవంలో చంద్రబాబు నాయుడు ఈ సారి ఘోర పరాజయం పొందారు. ఈ నేపథ్యంలో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలను మరో సీనియర్‌కు అప్పగిస్తారనే అభిప్రాయం పార్టీలో అంతర్గతంగా వ్యక్తం అవుతోంది. చంద్రబాబు రాజకీయ అనుభవమంత వయసున్న నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనుండటం.. రేపటి రోజున సభలో సభానాయకుడిని ఎదుర్కునే విషయంలో చంద్రబాబు ఇబ్బందికరంగా భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ప్రతిపక్ష నాయకుడిగా తన స్థానంలో మరో సీనియర్‌ని నియమించి తాను తప్పుకోవాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది.

ప్రజల తీర్పును స్వాగతిస్తున్నాం..! జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన బాబు..!!

ప్రజల తీర్పును స్వాగతిస్తున్నాం..! జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన బాబు..!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ రాజీనామాను గవర్నర్ కార్యాలయానికి పంపారు. గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్ రాజీనామా ఆమోదించి తదుపరి ఏర్పాట్లు చేసేవరకు కొనసాగవలసిందిగా కోరారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన సేవలకు గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాను అని చంద్రబాబు అన్నారు. వైసీపీ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలుపున్నాను. ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ పట్నాయక్, నరేంద్రమోడీ, వైస్ జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు. ఎన్నికల్లో విజయం కోసం పని చేసిన టీడీపీ కార్యకర్తలకు ధన్యవాదాలు. ఓటమికి గల కారణాలపై విశ్లేషణ చేసి త్వరలోనే వెల్లడిస్తామని చంద్రబాబు తెలిపారు.

జగన్ ను కలిసిన సీఎస్ ఎల్వీ..! సీఎస్ గా కొనసాగింపు..!!

జగన్ ను కలిసిన సీఎస్ ఎల్వీ..! సీఎస్ గా కొనసాగింపు..!!

రాష్ట్రంలో నీతివంత‌మైన పాల‌న అందించ‌డ‌మే నా ప్ర‌ధాన ల‌క్ష్యం అని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి వైఎస్. జ‌గ‌న్ తెలియచేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడుగా మాజీ సీఎస్ అజ‌య్ క‌ల్లం ను నియ‌మిస్తున్న‌ట్లు చెప్పారు. అజ‌య్ క‌ల్లాంతో క‌లిసి ప‌ని చేయాల‌ని ఎల్వీకి సూచించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్యద‌ర్శిగా ఎల్వీనే కోన‌సాగ‌మ‌ని జ‌గ‌న్ కోరారు. కాబోయే సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని సీఎస్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం మర్యాదపూర్వకంగా కలిశారు.

జగన్ తో భేటీ అయిన గౌతమ్ సవాంగ్..! ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ఏర్పాట్లు..!!

జగన్ తో భేటీ అయిన గౌతమ్ సవాంగ్..! ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ఏర్పాట్లు..!!

ఈ నెల 30న ప్ర‌మాణా స్వీకారోత్స‌వానికి ఏర్పాట్లు చేయాల‌ని జ‌గ‌న్ సూచించారు. జూన్ 1 నుండి 5 వ‌రకు స‌మీక్ష‌లు ఉంటాయన్నారు. పాల‌నలో ప్ర‌స్తుతం ఉన్న వాస్త‌వ ప‌రిస్థితుల‌పై స‌మీక్షలు చేయనున్నారు. రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు జ‌గ‌న్ ను అఖిల భార‌త‌స్థాయి అధికారులు క‌ల‌వ‌నున్నారు. డీజీపీ రేసులో గౌతమ్ సవాంగ్ ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో జగన్ తో భేటీ ప్రాధాన్యత సంతరించుకున్నది. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ గా పనిచేస్తున్నారు.

English summary
YSR Congress party wave in Andhra Pradesh elections countinued.The Chief Minister of the party YS Jaganmohan Reddy will be finalized on 30th of this month. But the debate in the TDP was on the issue of who was the Leader of Opposition in the Legislative Assembly from the main Opposition TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X