కాకినాడ మేయర్ రేసులో 4గురికి గాడ్ ఫాదర్లు వీరే: తెరవెనుక ప్రయత్నాలు
కాకినాడ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 12 లోగా ఆయా డివిజన్లలో గెలుపొందిన అభ్యర్థులందరికీ నోటీసులు ఇవ్వాలి. వారందర్నీ సమావేశపరచి మేయర్, డిప్యూటీలను ఎన్నుకోవాల్స
కాకినాడ: కాకినాడ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 12 లోగా ఆయా డివిజన్లలో గెలుపొందిన అభ్యర్థులందరికీ నోటీసులు ఇవ్వాలి. వారందర్నీ సమావేశపరచి మేయర్, డిప్యూటీలను ఎన్నుకోవాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే చర్చ జోరుగా సాగుతోంది. మేయర్ పదవి ఓసి మహిళకు రిజర్వ్ అయింది. ఈ నేపథ్యంలో కాపులకు మేయర్ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

టిడిపిలో సస్పెన్స్.. 4గురికి గాడ్ ఫాదర్లు
మేయర్ పదవి రేసులో టిడిపిలో నలుగురు ఉన్నారు. వారిలో శేషు కుమారి, అడ్డూరి వరలక్ష్మి, సుంకర శివప్రసన్న, సుంకర పావనిలు ఉన్నారు. వీరిలో ఎవరికి మేయర్ పదవి దక్కుతుందనే సస్పెన్స్ టిడిపి వర్గాల్లో నెలకొని ఉంది. ఈ నలుగురికి నలుగురు గాడ్ ఫాదర్ల ఆశీస్సులు ఉన్నాయని తెలుస్తోంది.

తెరవెనుక ప్రయత్నాలు.. ఎవరిది పైచేయి?
కాకినాడలో టిడిపి గెలుపొందినప్పటి నుంచే మేయర్ పదవికి ఆయా నేతలు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. నలుగురి వెనుక కూడా కీలక నేతలు ఉన్నారు. ముఖ్య నేతల అండ ఉండటంతో తమకు పదవి దక్కుతుందని నలుగురు గట్టిగా నమ్ముతున్నారు. చివరకు ఎవరిది పైచేయి అవుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

రేసులో మాకినేని శేషు కుమారి
మేయర్ రేసులో మాకినేని శేషు కుమారి ఉన్నారు. ఆమె గతంలో ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఈమేకు మంత్రి నారాయణ అండదండలు ఉన్నాయని తెలుస్తోంది.

రేసులో అడ్డూరి వరలక్ష్మి
అడ్డూరి వరలక్ష్మి న్యాయవాది. 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు విఫలయత్నం చేశారు. కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆశీస్సులు ఉన్నాయి. ఆయన మద్దతుతో కార్పోరేటర్‌గా గెలిచారు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో పెద్ద ఎత్తున మద్దతు ర్యాలీలు నిర్వహించి, మన్ననలు పొందారు. వరలక్ష్మికి మేయర్ పదవి కోసం కొండబాబు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

సుంకర ప్రసన్న
సుంకర ప్రసన్నకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆశీస్సులు ఉన్నాయి. ఈమె భర్తకు కాకినాడ వైసిపి ఇంచార్జితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత టిడిపిలో చేరారు. అనంతరం మంత్రి యనమలకు దగ్గరయ్యారు.

సుంకర పావని
కాకినాడ మేయర్ రేసులో ఉన్న మరో మహిళ సుంకర పావని. భర్త తిరుమల్ కుమార్. కాకినాడ టిడిపి అధ్యక్షులు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో చేరి, తిరిగి మళ్లీ టిడిపి గూటికి వచ్చారు. ఈయన మంత్రి తోట నర్సింహం అనుచరుడు. దీంతో భార్య కోసం ఎంపీ తోట ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.
-
అమరావతిపై జగన్ ప్లాన్ 'బీ' - కొత్త రాజధాని “మావిగన్”..!! -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications