కాకినాడలో పాగా వేసేదెవరు? మూడు పార్టీల్లో తీవ్ర ఉత్కంఠ!
నంద్యాల ఉప ఎన్నిక వేడి చల్లారకముందే.. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక గరం మొదలైంది. ఈ రోజే పోలింగ్ జరుగుతోంది. ఈ నగరపాలక సంస్థ మేయర్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తిదాయకంగా మారింది.
కాకినాడ: నంద్యాల ఉప ఎన్నిక వేడి చల్లారకముందే.. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక గరం మొదలైంది. ఈ రోజే పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ మేయర్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తిదాయకంగా మారింది.
మంగళవారం ఉదయం ఏడు గంటలకే కాకినాడలో పోలింగ్ మొదలైంది. ఇక్కడ మొత్తం 196 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. సాయంత్రం ఐదు గంట వరకూ పోలింగ్ జరగనుంది. నంద్యాలలో విజయాన్ని కైవసం చేసుకున్న టీడీపీయే ఇక్కడా జెండా ఎగరేస్తుందా? ఈ ప్రశ్నకు జవాబు కావాలంటే సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు ఆగాల్సిందే!

పొత్తులో టీడీపీ, బీజేపీ.. ఒంటరిగా వైసీపీ...
కాకినాడలో యాభై డివిజన్లు ఉన్నా పోలింగ్ మాత్రం 48 డివిజన్లకే జరుగుతోంది. కాకినాడ మున్సిపల్ ఎన్నికకు సంబంధించిన ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటే.. ఇక్కడ ఏకంగా 240 మందికి పైగా అభ్యర్థులు పోటీలో ఉండటం. తెలుగుదేశం, బీజేపీలు పొత్తుతో పోటీ చేస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోంది.
Recommended Video


అక్కడ మాత్రం.. పొత్తు గిత్తు జాంతానై...
తెలుగుదేశం పార్టీ 42 డివిజన్లలో పోటీలో ఉండగా, తొమ్మిది డివిజన్లలో బీజేపీ పోటీలో ఉంది. మూడు డివిజన్లలో మాత్రం బీజేపీ, టీడీపీ పొత్తు ఒప్పందాన్ని ఉల్లంఘించుకుని మరీ పోటీకి దిగాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల సంగతిలా ఉంటే...

ఇండిపెండెంట్ అభ్యర్థుల హవా...
ప్రస్తుతం కాకినాడ మున్సిపల్ ఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్థుల హవా అధికంగా కనిపిస్తోంది. చాలా డివిజన్లలో ప్రధాన పార్టీలకు రెబెల్స్ పోటు తప్పడం లేదు. పార్టీ టికెట్ దక్కలేదని చాలా మంది ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగారు. మరి ఈ నేపథ్యంలో పోలింగ్ లో ప్రజలు ఎటువైపు మొగ్గుతారో చూడాల్సి ఉంది. సెప్టెంబర్ ఒకటో తేదీన కాకినాడ కౌంటింగ్ జరగనుంది.

జోరుగా సాగిన ప్రచారం...
ఇక ప్రచార పర్వంలో టీడీపీ-బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు బాగానే హడావుడి చేశాయి. టీడీపీ తరపున డివిజన్ కు ఒక ఎమ్మెల్యే రంగంలోకి దిగి పని చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పాటు ప్రచారాన్ని హోరెత్తించారు. బీజేపీ తరపున మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. ఇక వైసీపీ తరపున ఆ పార్టీ అధినేత జగన్ ఒక రోజు ప్రచారం చేయగా.. ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు కాకినాడలోనే మకాం పెట్టి మరీ ప్రచారం చేశారు.












Click it and Unblock the Notifications