ప్రివిలైజ్ కమిటీ ముందుకు రోజా?: క్షమాపణ చెప్పాల్సింది ఎవరికి?

హైదరాబాద్: అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురైన వైసీపీ ఎమ్మెల్యే రోజాకు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో చుక్కెదురైన సంగతి తెలిసిందే. రోజా సస్పెన్షన్ వ్యవహారంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టేసింది. అంతేకాదు అసెంబ్లీ కార్యదర్శి వాదనను హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది.

ప్రివిలైజ్ కమిటీ నిబంధనలకు కట్టుబడి ఉండాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో రోజా సస్పెన్షన్ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఈ క్రమంలో ప్రివిలైజ్ కమిటీ విచారణకు రోజా హజరవుతారనే వార్తలు వస్తున్నాయి.

సోమవారం సాయంత్రం సభలో స్పీకర్ మాట్లాడుతూ రోజా సభకు చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెబితే సభ నిర్ణయం మరోలా ఉండేదని అన్నారు. ఇటీవల ప్రివిలేజ్‌ కమిటీ సమావేశానికి రోజా హాజరు కాలేదని, మరోసారి ఆమె ప్రివిలేజ్‌ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇచ్చుకునేందుకు సభ అనుమతించిందని అన్నారు.

Whom to say sorry to roja in Andhra Pradesh Assembly

అయితే అప్పటి వరకు ఆమెపై సస్పెన్షన్ కొనసాగుతుందని సభ తీర్మానించిందని చెప్పారు. ప్రివిలైజ్ కమిటీ కమిటీ మరోసారి ఇచ్చే నివేదిక ఆధారంగా రోజాపై చర్యలు తీసుకుంటామని అన్నారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యేలు ప్రివిలైజ్ కమిటీ విచారణకు హాజరయ్యేందుకు రోజా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

రోజా ప్రివైలజ్ కమిటీ ముందు హాజరై క్షమాపణ చెబితే సరిపోతుందని కూడా అంటున్నారు. రోజా క్షమాపణ చెబితే ఆమె సస్పెన్షన్‌ను పునఃపరిశీలిస్తారంటూ ఈ మేరకు వార్తలు కూడా వస్తున్నాయి. కానీ నిజానికి రోజా, టీడీపీ ఎమ్మెల్యే అనితను దూషించారనేది ప్రధాన ఆరోపణ. అయితే కమిటీ ముందు హాజరై రోజా కమిటీకి క్షమాపణ చెబితే అనిత ఊరుకుంటారా?

అయితే ప్రభుత్వం చెప్పినట్లుగా ప్రివిలైజ్ కమిటీ వద్దకు రోజా వెళ్లినా సస్పెన్షన్‌ను ఎత్తేయలేదని ప్రభుత్వాన్ని నిందించవచ్చనే ఆలోచనలో వైసీపీ నేతలు ఉన్నారు. ఇటీవల అనిత మీడియాతో మాట్లాడుతూ తాను రోజాపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టకుండా తన నుంచి కేవలం క్షమాపణ మాత్రమే కోరుకుంటున్నానని పలు సందర్భాల్లో అన్నారు.

మరోవైపు అసెంబ్లీ సాక్షిగా రోజా నన్ను అవమానించారు కాబట్టి అసెంబ్లీలోనే తనను క్షమాపణ కోరాలంటూ డిమాండ్ చేశారు. అయితే ఎమ్మెల్యే రోజా అందుకు సిద్ధమేనా? అనేది సందేహమే. ఆమె నాలుగు గోడల మధ్య కమిటీకి సారీ చెప్పగలరే తప్ప సభ సాక్షిగా అనితకు సారీ చెబుతారని ఊహించలేం అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

కమిటీకి సారీ చెప్పి తప్పించుకోవడం సాధ్యం కాదని, సభలో అనితకు సారీ చెప్తేనే రోజాను సభాప్రవేశం సాధ్యం కాకపోవచ్చునని పలువురు విశ్లేషిస్తున్నారు. అయితే నిజానికి రోజా వ్యవహారంలో ఒక పథకం ప్రభుత్వం పావులు కదుపుతోంది. పకడ్బందీగా రోజాను ఏడాది సస్పెండ్ చేసే యోచనలోనే ఉన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+