Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ ను భయపెడుతున్న స్టాలిన్-పీకే చూపిన బాటలోనే-రోల్ మోడల్ ను ఇగ్నోర్ చేయడం వెనుక ?

రెండేళ్ల క్రితం ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ తన ప్రమాణస్వీకారానికి దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ సీఎంతో పాటు తమిళనాడులో డీఎంకే అధినేతగా ఉన్న స్టాలిన్ ను కూడా ఆహ్వానించారు. అప్పటికే కేసీఆర్ తో ఉన్న సంబంధాల నేపథ్యంలో ఆయన్ను జగన్ ఆహ్వానించడం పెద్దగా ఆశ్చర్యం కలిగించకపోయినా డీఎంకే అధినేత స్టాలిన్ ను ఆహ్వానించడం పై చర్చ జరిగింది. స్టాలిన్ కూడా జగన్ లాగే యువనేత కావడం, తండ్రి వారసత్వంగా సీఎం అయ్యేందుకు బాటలు వేసుకుంటున్న పరిస్ధితి కావడం ఇందుకు కారణమని అంతా భావించారు. సీన్ కట్ చేస్తే స్టాలిన్ ఈ ఏడాది జరిగిన తమిళనాడు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి సీఎం అయిపోయారు. కానీ ఇప్పటివరకూ జగన్ మాత్రం స్టాలిన్ గురించి ఎక్కడా మాట్లాడింది లేదు. దీని వెనుక ఆసక్తికర కారణాలు కనిపిస్తున్నాయి.

 జగన్-స్టాలిన్ పోలిక

జగన్-స్టాలిన్ పోలిక

వైఎస్ జగన్, ఎంకే స్టాలిన్ ఇద్దరూ ప్రస్తుతం దక్షిణ భారత దేశంలోని రెండు కీలక రాష్ట్రాలైన ఏపీ, తమిళనాడుకు సీఎంలుగా ఉన్నారు. వీరిద్దరూ మాజీ ముఖ్యమంత్రుల తనయులే. తండ్రుల మరణం తర్వాత వారి వారసత్వాన్ని అంది పుచ్చుకుని ప్రజాభిమానాన్ని సంపాదించుకుని సీఎం పదవులు దక్కించుకున్న వారే. జగన్ తో పోలిస్తే స్టాలిన్ కొంత వయస్సులో పెద్దవారైనా, అనుభవజ్ఞుడు, పరిణితి చెందిన నేతగా కూడా పేరు తెచ్చుకున్నారు. తమిళనాడులో మారిన రాజకీయ పరిస్ధితుల్లో అక్కడి ప్రజలకు ప్రస్తుతం ఆశాదీపంగా కనిపిస్తున్నారు. సరిగ్గా ఏపీలోనూ అలాగే మారిన పరిస్ధితుల్లో సీఎం జగన్ కూడా భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. అయితే వీరిద్దరి వ్యవహారశైలిలో మాత్రం భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.

జగన్ తో స్టాలిన్ సంబంధాలు

జగన్ తో స్టాలిన్ సంబంధాలు

ఏపీ సీఎం వైఎస్ జగన్ తో స్టాలిన్ కు సీఎం కాకముందు నుంచే పరిచయం, అనుబంధం ఉన్నాయి. అయితే మరీ ఎక్కువగా వీరిద్దరూ కలిసి తిరిగింది లేదు, రాజకీయ భావజాలాన్ని పంచుకుంది లేదు, జాతీయ స్ధాయిలో కలిసి పనిచేసేందుకూ సిద్ధంగా లేరు. దీనికి ప్రధాన కారణం వారి గతంతో పాటు ప్రస్తుతం వీరిద్దరూ ఎదుర్కొంటున్న పరిస్ధితులే. అయినా తప్పనిసరి అయితే కలిసి పనిచేసేందుకు సిద్ధంగానే ఉన్న నేతలు కూడా. అయితే ప్రస్తుతానికి మాత్రం వీరిద్దరూ దూరం దూరంగా ఉంటూ తమ పని తాము చేసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ గతంలో సత్సంబంధాలు కొనసాగించి ఇప్పుడు దూరంగా ఉండటంపై చర్చ జరుగుతోంది.

 సీఎం అయ్యాక స్టాలిన్ ను దూరం పెట్టిన జగన్

సీఎం అయ్యాక స్టాలిన్ ను దూరం పెట్టిన జగన్

గతంలో తండ్రి కరుణానిధి వారసుడిగా, డీఎంకే అధినేతగా ఉన్న స్టాలిన్ విషయంలో జగన్ కు సానుభూతి, సాఫ్ట్ కార్నర్ ఉండేవని చెబుతారు. ఈ సమయంలోనే సీఎంగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం జగన్ .. స్టాలిన్ ను ఆహ్వానించారు. కానీ ఓసారి స్టాలిన్ సీఎం అయ్యాక మాత్రం జగన్ ఆయన్ను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. స్టాలిన్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి జగన్ ను ఆహ్వానించలేదు, జగన్ కూడా వెళ్లలేదు. ఆ తర్వాత కూడా స్టాలిన్ తీసుకుంటున్న పలు విప్లవాత్మక నిర్ణయాలపై జగన్ మాటమాత్రంగా కూడా స్పందించడం లేదు. స్టాలిన్ నిర్ణయాల్ని దేశమంతా మెచ్చుకుంటున్నా పక్కనే ఉన్న జగన్ మాత్రం తన సొంత రాష్ట్రంలో అనుసరించేందుకు కూడా సిద్ధం కావడం లేదు. దీంతో జగన్ కు ఏమైందనే చర్చ సాగుతోంది.

ప్రజాకర్షక నేతగా ఎదుగుతున్న స్టాలిన్

ప్రజాకర్షక నేతగా ఎదుగుతున్న స్టాలిన్


ప్రజల మనసుల్లో ఏముందో తెలుసుకుని దానికి అనుగుణంగా వ్యవహరించే వారే ప్రజా నేతలుగా పేరు తెచ్చుకుంటారు. గతంలో పాదయాత్ర సందర్భంగా ప్రజల కష్టాలు తెలుసుకుని వాటిని సీఎం అయ్యాక నెరవేర్చిన ఘనత మాజీ సీఎం వైఎస్సార్ కు చెందుతుంది. ఇప్పుడు స్టాలిన్ కూడా అంతే. కేవలం తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం మాత్రమే కాదు ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని, ప్రజల్లో దేనిపై ఎక్కువగా చర్చ జరుగుతుందో తెలుసుకుని నెరవేర్చడమే సిసలైన రాజకీయమని స్టాలిన్ ఎప్పుడో వంటబట్టించుకున్నారు. దీంతో ఇప్పుడు తమిళనాడులో అమ్మక్యాంటీన్లను కొనసాగిస్తున్నా, దేవాలయాలకు నిధులిస్తున్నా, ప్రజలతో నిత్యం మమేకమవుతున్నా, సమస్యలపై అఖిలపక్ష కమిటీలు నియమిస్తున్నా, అసెంబ్లీలో ఎమ్మెల్యేల క్యాంటీన్ ఎత్తేసినా స్టాలిన్ నిర్ణయాలు భేష్ అంటున్నారు దేశంలో రాజకీయ ప్రముఖులు. దీంతో సహజంగానే స్టాలిన్ సొంత రాష్ట్రంలో ప్రజాకర్షక నేతగా ఎదుగుతున్నారు.

కేంద్రంపై స్టాలిన్ దండయాత్ర

కేంద్రంపై స్టాలిన్ దండయాత్ర

ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యాక తన పని పూర్తయిందని భావించి ఇంట్లో కూర్చోవచ్చు.సమీక్షలతో కాలం గడిపేయొచ్చు. కానీ సీఎం స్టాలిన్ అలా చేయడం లేదు. సమీక్షలను అధికారులకు వదిలిపెట్టి పర్యవేక్షణకే పరిమితమవుతున్నారు. దీంతో తమిళనాడుకు నష్టం జరిగేలా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దీటుగా బదులిస్తున్నారు. కేంద్రంలో పటిష్టంగా ఉన్న ఎన్డీయేను కాదని విపక్షంలో ఉన్న యూపీఏతోనే కొనసాగుతున్నారు. అంతే కాదు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు, ఎన్నార్సీకి వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానాలు చేశారు. నిన్న మొన్నటి నీట్ పరీక్షపైనా నిప్పులు చెరిగారు. దీంతో దక్షిణాదిలో ఇప్పుడు కేంద్రంపై పోరాడుతున్న యోధుడిగా స్టాలిన్ పేరుతెచ్చుకుంటున్నారు.

Recommended Video

    Who Is Tiger Nageswara Rao? | Stuartpuram | Raviteja PanIndia | Oneindia Telugu
    స్టాలిన్ ను చూసి జగన్ భయపడుతున్నారా ?

    స్టాలిన్ ను చూసి జగన్ భయపడుతున్నారా ?

    ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో సొంత రాష్ట్రాల్లో భారీ విజయాన్ని అందుకున్న స్టాలిన్, జగన్ ఇప్పుడు తమదైన పంథాల్లో పాలన సాగిస్తున్నారు. అయితే స్టాలిన్ ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని ఎప్పటికప్పుడు డైనమిక్ నిర్ణయాలు తీసుకుంటుంటే జగన్ మాత్రం అప్పులు తెచ్చయినా మ్యానిఫెస్టో అమలు చేస్తే చాలని భావిస్తున్నారు. అటు స్టాలిన్ విపక్షాలను గౌరవిస్తుంటే జగన్ మాత్రం విపక్షాల్ని ఎన్నడూ లేనంత దారుణంగా టార్గెట్ చేస్తున్నారు. కేంద్రంలో పోరులోనూ స్టాలిన్ దూసుకుపోతుంటే జగన్ తన సొంత కేసుల భయంతో తప్పనిసరి పరిస్ధితుల్లో కేంద్రంతో అయిష్టంగానే సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో స్టాలిన్ కు ప్రజాదరణ అంతకంతకూ పెరుగుతుంటే జగన్ కు మాత్రం సొంత రాష్ట్రంలో ప్రజా దరణతో పాటు దేశవ్యాప్తంగా సీఎంల ప్రజాదరణలో సైతం వెనక్కిపోవాల్సిన పరిస్ధితులు తలెత్తుతున్నాయి. దీంతో ఇప్పుడు స్టాలిన్ ను ఫాలో కావడం కానీ, ఆయన నిర్ణయాల్ని ప్రశంసించడం కానీ, ఆయన బాటలో సాగడం కానీ, కనీసం ఆయన పేరెత్తేందుకు సైతం జగన్ సాహసించడం లేదు. స్టాలిన్ గురించి మాట్లాడితే స్వరాష్ట్రంలోని ప్రజల్లో పోలికలు మొదలవుతాయన్న భయం వెంటాడుతున్నట్లు తెలుస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+