హైద్రాబాద్ వాటా వాదన లేవనెత్తిన మైసూరా, ప్రజాసేవేనని జయప్రద
న్యూఢిల్లీ: హైదరాబాదు ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ వాటాను ఎందుకు అడగడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి శుక్రవారం మరోసారి వాదన లేవనెత్తారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుల తీరుతో ఇరు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
విభజన చట్టంలో మార్పులు చేయాలన్నారు. గవర్నర్ నరసింహన్ ఆలయాల చుట్టు తిరిగేందుకే సమయం సరిపోతుందని ఎద్దేవా చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులకు దెయ్యం పట్టుకుందన్నారు. ఇరువురు కలిసే ట్యాక్స్, వ్యాట్, ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 72ను సవరించాలన్నారు. జీవో 15పై ఏపీ ప్రభుత్వం న్యాయ పోరాటం చేయడం లేదని ఆరోపించారు. పన్నుల విధింపులో రెండు రాష్ట్రాలు కలిసి పని చేస్తున్నాయన్నారు. రవాణ పన్ను తన చేతిలో లేదనడం కేంద్రమంత్రిది బాధ్యతారాహిత్యమన్నారు.
ప్రజాసేవ చేయాలని ఉంది: జయప్రద
మాజీ పార్లమెంటు సభ్యురాలు, ప్రముఖ సినీ నటి జయప్రద తన పుట్టిన రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబసమేతంగా స్వామి సేవలో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మరికొంత ప్రజాసేవ చేయాలని ఉందన్నారు.












Click it and Unblock the Notifications