అద్వానీని చూస్తే బాధేస్తోంది: షబ్బీర్, టిపై బిజెపికి ప్రశ్న

Why BJP is not ready support T: Shabbir Ali
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీని చూస్తుంటే తమకే బాధేస్తోందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యులు షబ్బీర్ అలీ ఆదివారం అన్నారు. భేషరతుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిస్తామని చెప్పిన బిజెపి ఇప్పుడు అభ్యంతరం చెబుతుండటం విడ్డూరమన్నారు. ఇచ్చిన మాట ప్రకారం బిజెపి తెలంగాణకు కట్టుబడి ఉండాలన్నారు.

తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామన్న బిజెపి ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతోందని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని చంద్రబాబు మరోసారి విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావును మానసికంగా హింసించిన చంద్రబాబు హంతకుడన్నారు. సోనియా గాంధీని గాడ్సే అనడం విడ్డూరమన్నారు. అసలు గాడ్సేనే చంద్రబాబు అన్నారు.

మరోవైపు కేంద్ర మంత్రి బలరాం నాయక్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తుండగా తెలంగాణవాదులు అడ్డుకున్నారు. భద్రాచలం ముంపు ప్రాంతాలు తెలంగాణలోనే ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భద్రాచలం డివిజన్లోని ఒక్క గ్రామం కూడా సీమాంధ్రలోకి వెళ్ళదని, రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లులో తాము సూచించిన సవరణలకు సోనియా అంగీకరించారని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+