వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిచ్ టార్గెట్: చంద్రబాబు 'డబుల్' ధమాకా వెనుక ఎన్నో కారణాలు?

|
Google Oneindia TeluguNews

విజయవాడ: తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఇప్పటి దాకా టిడిపి కుటుంబంలో 54 లక్షలు. దీనిని డబుల్ చేయాలని కార్యకర్తలను చంద్రబాబు ఉత్సాహపరుస్తున్నారు.

ఏపీలో టిడిపి అధికారంలో ఉంది. మరోవైపు బీజేపీ, జనసేన ఎదుగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది 54 లక్షలు అయిన సభ్యత్వాన్ని ఈసారి కోటికి పెంచాలని చంద్రబాబు చెప్పడం గమనార్హం.

రివర్స్, టిడిపిలో ఆందోళన: చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ చెక్, జగన్ సేఫ్!రివర్స్, టిడిపిలో ఆందోళన: చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ చెక్, జగన్ సేఫ్!

సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. ఇలాంటప్పుడు తెలుగు తమ్ముళ్లు ఎవరూ ఊహించని విధంగా కోటి సభ్యత్వాలు అనడంపై చర్చ జరుగుతోంది. అందుకు పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.

Why Chandrababu Naidu wants to double TDP membership to one crore in 2016?

ఓ వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. దీని ప్రభావం టిడిపి పైన కచ్చితంగా ఉంటుందని అంటున్నారు. మరోవైపు బీజేపీ.. టిడిపి,వైసిపిలకు ధీటుగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని జిల్లాల్లో బలపడే కార్యక్రమాలు చేపడుతోంది.

మరోవైపు, అధికారంలో ఉన్నందున టిడిపిని పలు సమస్యలు చుట్టుముడుుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపే భాగంలో, అలాగే యువత కూడా తమ వైపు ఉందని చెప్పుకునేందుకే కోటి టార్గెట్ చెప్పినట్లుగా భావిస్తున్నారు. అదే సమయంలో త్వరలో పలు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. వీటి కారణంగానే టార్గెట్ గతంలో కంటే డబుల్ చెప్పినట్లుగా భావిస్తున్నారు.

English summary
TDP national president N. Chandrababu Naidu to raise the membership of the party from 50 lakhs to one crore though legislative assembly elections are more than two and a half years away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X