అట్టుడుకుతుంటే సింగపూర్‌లో సూటుకేసులు సర్దుతారా?: చంద్రబాబుపై రోజా

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఓ వైపు ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా కోసం ఉద్యమం జరుగుతుంటే, రాష్ట్రం అట్టుడుకుతుంటే మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం సింగపూర్ పర్యటనకు వెళ్లి సూటుకేసులు సర్దుకుంటున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు.

చంద్రబాబు వెంటే మేం, టీడీపీ కోసం నేను-జూ.ఎన్టీఆర్ సిద్ధం: కళ్యాణ్ రామ్

Why Chandrababu Naidu went Singapore, Roja questiones

హోదా కోసం ఉద్యమం జరుగుతున్న సమయంలో చంద్రబాబు విదేశాలకు వెళ్లడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. హోదా ఉద్యమంపై అవహేళనగా మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఉద్యమిస్తుంటే చంద్రబాబు మాత్రం షికార్లు చేస్తూ సింగపూర్ వెళ్లి కూర్చున్నారన్నారు.

మీ నోటుకు ఓటు కేసు, అసమర్థ పాలన పైన దర్యాఫ్తు జరిగితే దొరికిపోతారని, అది తెలిసే చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లారని ఆమె మండిపడ్డారు.

Why Chandrababu Naidu went Singapore, Roja questiones

రోజా తన నియోజకవర్గంలోని వడమాలపేట మండలం రామసముద్రంలోని ఓ కుటుంబాన్ని పరామర్శించారు. మరో వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంపై స్పందించారు. వడమాలపేట మండలంలో కేశవ అనే పిల్లవాడు స్కేటింగ్‌లో బంగారు పథకాలు సాధించారు. రోజా అతనిని అభినందిస్తూ రూ.70,000 విలువ చేసే స్కేటింగ్ షూస్, కిట్స్‌ను బహుమతిగా ఇచ్చారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party MLA Roja on Friday questioned Telugudesam Party chief Nara Chandrababu Naidu for his Singapore tour.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X