చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సికె బాబుతో కటారి దంపతుల రాజీ: చింటూ కక్షకు మూడు కారణాలివే..

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్‌ల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా చింటూ అలియాస్ చంద్రశేఖర్‍‌ను పోలీసులు భావిస్తున్నారు. అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అనురాధ దంపతుల అంత్యక్రియలు గురువారంనాడు అధికార లాంఛనాలతో జరిగాయి.

చింటూ తల్లిదండ్రులు పోలీసుల సంరక్షణలో ఉన్నారు. తమకు ప్రాణ హాని ఉందంటూ వారు పోలీసులు అశ్రయించారు. దీంతో ఈ నెల 17వ తేదీ నుంచి వారు తమ సంరక్షణలోనే ఉన్నారని పోలీసు అధికారి సూర్యనారాయణ చెప్పారు. తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులవంటివారైన మేనత్త అనురాధను, మామ మోహన్‌ను చింటూ ఎందుకు హత్య చేశాడనేది ఆశ్చర్యకరమైన విషయంగా మారింది. అందుకు మూడు కారణాలున్నాయని అంటుననారు.

మూడు కారణాల్లో ఒకటి - తమ రాజకీయ ప్రత్యర్థి సీకే బాబుతో కటారి మోహన్ దంపతులు సంధి కుదుర్చుకోవడమని చెబుతున్నారు. న్యాయబద్ధంగా వేలం పాటల్లో దక్కించుకుని చిత్తూరు కార్పొరేషన్ దుకాణ భవన సముదాయాన్ని మేయర్ సీటులో కూర్చొన్న తర్వాత అనురాధ రద్దు చేయడం రెండో కారణంగా చెబుతున్నారు. మెరైన్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేసుకుంటూ ఉన్న తనను ఫ్యాక్షన్ రాజకీయాల్లోకి దించి, ఇపుడు ఒంటరివాడిని చేయడాన్ని మూడో కారణంగా ప్రస్తావిస్తున్నారు.

Why Chintoo killed Katari anuradha couple?

దాంతో కటారి దంపతులపై చింటూ కక్ష పెంచుకున్నట్లు అనుమానిస్తున్నారు. తన మేనమామ కటారి మోహన్‌కు, మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు మధ్య ఫ్యాక్షన్ రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో 2005 సంవత్సరంలో కటారి మోహన్‌పై హత్యాయత్నదాడి జరిగింది. తర్వాత మోహన్ పిలుపుతో చింటూ చిత్తూరు చేరుకున్నాడు.

తన మేనమామ ప్రత్యర్థి అయిన సీకే బాబుపై 2007లో రెండు మార్లు హత్యాప్రయత్నం జరిగింది. ఈ హత్యాయత్నం కేసులో నిందితుడిగా మారి మేనమామతో కలిసి జైలు జీవితాన్ని గడిపాడు. ఆ తర్వాత చిత్తూరు ఫాక్షన్ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా మారాడు.ఈ దశలో చిత్తూరు కార్పొరేషన్ మేయర్ పీఠంపై మేనత్త అనురాధ కూర్చొన్న తర్వాత ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆ దంపతులు భావించారు. దీంతో తమ ప్రత్యర్థి సీకే బాబుతో సంధి చేసుకున్నారు. దీన్ని చింటు తీవ్రంగా వ్యతిరేకించారు.

అదేసమయంలో అనురాధ దంపతులు చింటును దూరం పెట్టసాగారు. ఈ క్రమంలో కార్పొషన్ వాణిజ్య భవన సముదాయాన్ని వేలం పాటల్లో చింటూ దక్కించుకోగా దాన్ని మేయర్ హోదాలో అనురాధ రద్దు చేసింది. ఈ చర్యను చింటూ జీర్ణించుకోలేక పోయాడు. ఆ తర్వాత కటారి దంపతులతో చింటూ బాహాటంగా తలపడటం, ఘర్షణలకు దిగడం ప్రారంభించాడు.

ఇదిలావుంటే, నగర మేయర్ అనురాధ దంపతుల హత్యకేసులో అనుమానితుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూపై పోలీసుల దృష్టి సారించారు. చింటూ విదేశాలకు వెళ్లకుండా చూడాలని చెన్నై, ముంబయి, హైదరాబాద్ విమానాశ్రయాల అధికారులకు చిత్తూరు పోలీసుల లేఖ రాశారు. హత్య జరిగిన రోజునుంచి అప్రమత్తమైన పోలీసులు చిత్తూరు నుంచి వెళ్లే ప్రతి ద్విచక్రవాహనం నుంచి పెద్ద పెద్ద వాహనాలన్నింటికి తనిఖీ చేసి పంపుతున్నారు.

English summary
It is said that Chandrasekhar alias Chintoo has killed Chittoor mayor Katari anuradha couple of three reasons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X