వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ ఇష్యూ, బాబు టేప్: పవన్ కళ్యాణ్‌కు నిలదీత

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/న్యూఢిల్లీ: నోటుకు ఓటు వ్యవహారం పైన జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని పెద్దపల్లి తెరాస ఎంపీ బాల్క సుమన్ మంగళవారం నాడు ప్రశ్నించారు. కొందరు ఢిల్లీ నేతలు గల్లీ స్థాయి నేతను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

ఓటుకు నోటు వ్యవహారంలో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చంద్రబాబుదే అన్నారు. ఎమ్మెల్యే కోనుగోలు విషయంలో బాబు పాత్ర పైన ఆధారాలు బయటపడ్డాయన్నారు. చంద్రబాబు ఏపీ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్టీపెన్ నివాసంలో దొరికిన రూ.50 లక్షలు చిత్తు కాగితాలా అని ప్రశ్నించారు.

పనికి రాని పరకాల ప్రభాకర్ ఫోన్ సంభాషణను ఎడిటింగ్ చేశారని అంటున్నారని ధ్వజమెత్తారు. ఈ కుట్రలో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా ఉన్నారని ఆరోపించారు.

చంద్రబాబు తన సంభాషణను పరోక్షంగా ఒప్పుకున్నారు: వినోద్

Why Pawan Kalyan is not responding: MP Suman

చంద్రబాబు తన సంభాషణను పరోక్షంగా అంగీకరించారని ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. పరకాల ప్రభాకర్ ఆ స్వరం చంద్రబాబుది కాదంటున్నారని, ఘటన పైన కేసు నమోదు చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపవచ్చునని చెప్పారు. ఫోన్ ట్యాంపరింగ్ చేయాల్సిన గత్యంతరం తమకు లేదన్నారు. పక్క రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్ రాజకీయ వ్యభిచారి: గాలి

కేసీఆర్ రాజకీయ వ్యభిచారి అని గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. టీడీపీలో పుట్టి, టీడీపీలో పెరిగి, టీడీపీ పైనే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. త్వరలో ఆయనకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

అదే అయితే బాబు రాజీనామా చేయాలి: జేపీ

ఆడియో టేప్‌లో గొంతు చంద్రబాబుదే అయితే చంద్రబాబు రాజీనామా చేయాలని లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ డిమాండ్ చేశారు. రేవంత్ మీ అనుమతి లేకుండా చేస్తే ఎందుకు ఆయనను పార్టీ నుండి బహిష్కరించలేదన్నారు.

అధినేతకు సంబంధం లేకుంటే రేవంత్ పైన చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఎన్టీఆర్ ఒక్క పైస ఖర్చు పెట్టకుండా రాజ్యసభకు పంపించిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఏపీ దివాళఆ తీస్తుంటే నేతలు కుబేరులు ఎలా అవుతారని ప్రశ్నించారు. బాబు బాధను తెలుగు ప్రజల బాధగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని, నిన్నటి చంద్రబాబు ప్రసంగం ప్రజలను రెచ్చగొట్టేలా ఉందన్నారు.

English summary
Why Pawan Kalyan is not responding: MP Suman
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X