శిల్పా మోహన్ రెడ్డికి ప్రచారం: దూరంగా సోదరుడు చక్రపాణి రెడ్డి, వైసిపిలో గుసగుస
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారానికి వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి గత కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారు.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల ప్రచారానికి వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి గత కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారు.

ఆట మొదలైందన్నారు
ఈ నెల మూడో తేదీన ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైసిపిలో చేరారు. నంద్యాల ఉప ఎన్నికలను ఉద్దేశించి ఆట మొదలైందని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. కానీ ఆ తర్వాత వైసిపి ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు.
Recommended Video


జగన్ రోడ్డు షోలో కనిపించని శిల్పా
దీనిపై ఆ పార్టీ శ్రేణుల్లో గుసగుసలు ప్రారంభమయ్యాయి. పార్టీ అధినేత వైయస్ జగన్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న రోడ్ షోల్లో ఆయన ఎక్కడా కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. తెర వెనుక కీలక రాజకీయం చేస్తున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నా, పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సోదరుడి వెంటే ఉంటానని చెప్పి
తన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి వెంటనే ఉంటానని చెబుతూ టిడిపిని వీడి, పదవిని వీడిన చక్రపాణి రెడ్డి ప్రచారానికి దూరంగా ఉండటమేమిటని వైసిపిలోనే చర్చ సాగుతోంది. ఆరు రోజులుగా జగన్ రోడ్ షోతో పాటు ఎక్కడ కూడా ఇంటింటి ప్రచారం చేయడంగాని, సభలు, సమావేశాల్లో పాల్గొనలేదు.

పార్టీలో చేరిన సమయంలో మినహా
పార్టీలో చేరిన తర్వాత మూడు, నాలుగు సందర్భాల్లో తప్ప ఎక్కడా బయట కనపడకపోవడంపై చర్చ సాగుతోంది. అసలు శిల్పా మోహన్ రెడ్డికి సోదరుడు చక్రపాణి రెడ్డి మద్దతు ఇస్తున్నారా లేదా, వైసిపిలో చేరిన తర్వాత అన్న కోసం గట్టిగా ప్రచారంలో పాల్గొనకపోవడం ఏమిటనే చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications