రేవంత్ వ్యాఖ్యలతో వైసీపీకి ఛాన్స్?: దమ్ము లేదా అంటూ టీడీపీ దుమ్ము దులిపారు..
ఏపీ టీడీపీ నేతలపై తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎక్కుపెట్టిన ఆరోపణలు.. ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ఛాన్స్ ఇచ్చినట్లయింది. రేవంత్ చేసిన ఆరోపణలపై స్పందించే దమ్ము, ధైర్యం ఏపీ టీడీపీ నేతలక
విజయవాడ: ఏపీ టీడీపీ నేతలపై తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎక్కుపెట్టిన ఆరోపణలు.. ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ఛాన్స్ ఇచ్చినట్లయింది. రేవంత్ చేసిన ఆరోపణలపై స్పందించే దమ్ము, ధైర్యం ఏపీ టీడీపీ నేతలకు లేదా? అని వారు ప్రశ్నిస్తున్నారు.
తాజాగా విజయవాడ పార్టీ కార్యాలయంలో వైసీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్,సోమినాయుడు మాట్లాడుతూ ఇదే తరహాలోప్రశ్నించారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలకు బదులిచ్చే దమ్ముందా? అని ప్రశ్నించిన నేతలు.. ఓటుకు నోటు కేసులో సూత్రధారులెవరో కూడా రేవంత్ చెప్పాలన్నారు.

రాష్ట్రంలో ఉమా పేరు చెబితే ఇసుక మాఫియా కింగ్ అని ఎవరైనా చెబుతారన్నారు. ప్రశ్నిస్తున్నందుకే వైసీపీ మీద అసత్యాలతో దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. ఏపీలో మంత్రులుగా ఉంటూనే మరోవైపు కేసీఆర్‌తో కుమ్మక్కు అయింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
సీఎం రమేష్, యనమల రామకృష్ణుడు వియ్యంకుడు సుధాకర్ యాదవ్‌కు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌లు ఇచ్చింది నిజం కాదా? అని నిలదీశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి, పోలవరం, అమరావతి నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు.
ఇక సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనల గురించి ప్రస్తావిస్తూ.. వాటి వల్ల ఒరిగేదేమి లేదన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనలన్నీ వ్యక్తిగత పర్యటనలేనని విమర్శించారు. రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా అనే పరిస్థితులు నెలకొన్నాయని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ...టీడీపీకి ఎన్నికల ప్రాజెక్ట్‌గా మారిపోయిందని, కమీషన్ల కోసమే ప్రభుత్వం కాంట్రాక్టర్లను మార్చుతోందని ఆరోపించారు.
ఓవైపు 2018నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చంద్రబాబు చెబుతున్నారని, కానీ ప్రాజెక్టులు మాత్రం ఎక్కడివక్కడే ఆగిపోయి ఉన్నాయని అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.












Click it and Unblock the Notifications