వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాలీవుడ్ అందుకే భయపడుతోందా?: 'హోదా'పై మౌనానికి అదే కారణమా?

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రత్యేకే హోదాపై ఏపీ ప్రజలంతా రోడ్ల పైకి వచ్చి పోరాటాన్ని ఉధృతం చేస్తున్నవేళ.. సినీ ఇండస్ట్రీ నుంచి మాత్రం ఆశించినంత స్పందన రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తమిళనాడు జల్లికట్టు ఉద్యమానికి సైతం మద్దతు తెలిపిన మహేష్ బాబు.. హోదాపై మాత్రం ఎందుకు గొంతెత్తడం లేదు?..

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

ఆయనొక్కరే కాదు.. ఇండస్ట్రీలో రాజమౌళి, రాఘవేంద్రరావు లాంటి దర్శక దిగ్గజాలు, స్టార్ హీరోలంతా 'హోదా'పై మౌనం వహిస్తున్నారు. నిఖిల్, శివాజీ, తమ్మారెడ్డి భరద్వాజ, పోసాని కృష్ణమురళి మాత్రమే ఇప్పటిదాకా హోదాపై గట్టిగా మాట్లాడారు.

why tollywood heroes and directors fearing to respond on ap special status

మిగతావాళ్ల మౌనం వెనుక కారణం ఏంటన్న దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అందుకు ఓ బలమైన కారణమే ఉందని తాజాగా ఓ ఆసక్తికర కథనం తెర పైకి వచ్చింది. 'ఐటీ' భయం వల్లనే ఇండస్ట్రీ ప్రముఖులంతా గప్ చుప్ అయిపోయారని అంటున్నారు.

తమిళనాడు సమస్యలపై గొంతెత్తినందుకు గతంలో విశాల్, కమల్ హాసన్ వంటి నటుల ఇళ్లపై ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం తన ఇంటిపై కూడా ఐటీ దాడులు చేయించారని ఇటీవల ఆరోపించారు.

ఈ నేపథ్యంలో.. తాము గొంతెత్తితే.. ఎక్కడ ఐటీ అధికారులు తమపై కూడా పడిపోతారేమోనన్న భయంతోనే వారు గొంతెత్తడం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది.

ఇండస్ట్రీలో ఎక్కువగా బ్లాక్ మనీయే సర్క్యులేషన్‌లో ఉంటుంది. రెమ్యూనరేషన్ల విషయంలోనూ బ్లాక్ మనీ తీసుకునేవాళ్లు చాలామందే ఉన్నారు. కాబట్టి.. హోదాపై గొంతెత్తితే ఐటీ చేతిలో అడ్డంగా బుక్ అవడం ఖాయమని వారంతా భావిస్తున్నట్టు తెలుస్తోంది.

English summary
Here is an interesting news about why tollywood personalities are fearing to react on Andhrapradesh Special status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X