వైనాట్ ఏపీ? కాంగ్రెస్ పవర్ పాలిటిక్స్; రంగంలోకి అన్నాచెల్లెళ్ళు రాహుల్, ప్రియాంకా గాంధీలు!!

తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకొని మంచి జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఏపీలో జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపే పనిని కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల పైన దృష్టిపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుంచే ఏపీ ప్రజల సమస్యలను తెలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించింది.

ప్రజలకు మరింత చేరువ కావాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు పక్కా ప్లాన్ తో ఏపీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని రంగంలోకి దించుతుంది. విశాఖ ఉక్కు కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ, అమరావతి కేంద్రంగా రాహుల్ గాంధీ రాజకీయాలను ముమ్మరం చేయనున్నారు.

Whynot AP? Congress Power Politics; Rahul gandhi and Priyanka Gandhi to AP!!

ఈనెల 26వ తేదీన విశాఖపట్నం రానున్న ప్రియాంక గాంధీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో కేంద్రానికి వ్యతిరేకంగా అక్కడ ఉద్యమకారులతో కలిసి తన గళాన్ని వినిపించనున్నారు. ప్రియాంక గాంధీ తన నాయనమ్మ ఇందిరాగాంధీ హయాంలో ఏర్పడిన విశాఖ ఉక్కు పరిశ్రమ మోడీ సర్కార్ ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో భారీ సభ నిర్వహించనున్నారు.

విశాఖలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై ప్రజలకు ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ బహిరంగ సభ ద్వారా ప్రయత్నం చేస్తుందని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ప్రధాన సమస్యలను దృష్టిలో పెట్టుకొని వాటిపైన పూర్తి అవగాహనతో ప్రజల పక్షాన పోరాటం చేస్తే ప్రజాక్షేత్రంలోకి వెళితే విజయం ఖాయంగా మారుతుందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ క్రమంలోనే ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెడుతుంది.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాజధానుల సమస్య చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది . అమరావతి రాజధాని అని పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు. అయితే మూడు రాజధానులను ఇప్పటివరకు ఏర్పాటు చేయలేకపోవడం వెరసి ఏపీలో రాజధాని సమస్య అతి ప్రధానమైన సమస్యగా మారింది.

Whynot AP? Congress Power Politics; Rahul gandhi and Priyanka Gandhi to AP!!

ఈ క్రమంలో ఇదే నెల 26వ తేదీన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు ఎంపీ రాహుల్ గాంధీ కూడా అమరావతిలో పర్యటించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక్కడ కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలపై రాహుల్ గాంధీ మాట్లాడడానికి రెడీ అవుతున్నారు.

రెండు ప్రాంతాలలో నిర్వహించే సభల ద్వారా ఏపీ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునేలా చేయాలని కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం వచ్చేలా ప్రయత్నాలు సాగిస్తోంది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం. మరి ఈ ప్రయత్నంలో వారు ఏ మేరకు సక్సెస్ అవుతారు అనేది వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+