స్విస్ ఛాలెంజ్ అంటే ఏమిటీ? వైసీపీకి చెక్ పెట్టేందుకు బాబు ప్లాన్ ఇదే!

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబందించి స్విస్ ఛాలెంజ్ పద్దతిపై విస్తృత చర్చకు సిద్దం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రివర్గ సభ్యులకు సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించిన స్విస్ ఛాలెంజ్ పద్దతికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మంగళవారంనాడు ఆమోదముద్రవేసింది. అమరావతి రాజధాని నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ పద్దతిలో ప్రతిపాదనలు రావడం నుండి కోర్టు కేసులు తాజా పద్దతివరకు మంత్రులకు సీఎం మంత్రివర్గంలో వివరించారు.

స్విస్ చాలెంజ్ ప్రక్రియపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులకు సూచించారు. స్విస్ చాలెంజ్ పై చర్చ సాగుతోంది. ఈ ప్రక్రియపై విస్తృతంగా చర్చ జరగాల్సిందేనని బాబు అభిప్రాయపడ్డారు. పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు , కార్యకర్తలు ఈ విషయమై అధ్యయనం చేయాలన్నారు.

అయితే స్విస్ ఛాలెంజ్ ను వైఎస్ఆర్ సిపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.ఈ పద్దతి వల్ల రాష్ట్రానికి ఏ రకంగా ప్రయోజనం ఉండదని ఆ పార్టీ అభిప్రాయపడుతోంది.

అసలు స్విస్ చాలెంజ్ అంటే ఏమిటీ?

అసలు స్విస్ చాలెంజ్ అంటే ఏమిటీ?

స్విస్ ఛాలెంజ్ పద్దతిలో బిడ్లను వేసిన తర్వాత, తక్కువ బిడ్ వేసిన వారికి కాంట్రాక్టును అప్పగించరు. తిరిగి పోటీలో ఉన్నకంపెనీ , అంతకన్నా తక్కువ ధరకు మెరుగైన డిజైన్లతో మరో ప్రణాళికను సమర్పించి కాంట్రాక్టును స్వంతం చేసుకోవచ్చు. ఆ తర్వాత మరో సంస్థ ఇంకో డిజైన్ ఇచ్చి అధికారులకు నచ్చితే కాంట్రాక్టు సంస్థకు లభించే అవకాశాలు దగ్గర చేసే పద్దతి ఉంది. అదే స్విస్ ఛాలెంజ్ పద్దతి. నియమిత సమయంలో ఓ కంపెనీ ఇలా ఎన్ని సార్లైనా కాంట్రాక్టును సవరించుకోవచ్చు.స్విస్ ఛాలెంజ్ పద్దతిలో అమరావతి నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.అయితే ఈ నిర్ణయంతో మరోసారి స్విస్ ఛాలెంజ్ విధానంపై మరోసారి చర్చకు కారణమైంది.అసలు స్విస్ ఛాలెంజ్ అంటే ఏమిటో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.స్విస్ అనగానే తట్టేది. ఆ దేశపు తటస్థ విధానం.ప్రపంచ దేశాల్లో ఆ దేశం ఎటూ మొగ్గుచూపకుండా ఉంది. అదే విధంగా వేర్వేరు కాంట్రాక్టర్లలో ఎవరిపట్ల పాలకపక్షం మొగ్గుచూపలేదు. దీంతో ప్రభుత్వం తటస్థంగా ఉంది.అందుకే స్విస్ అన్నారని చెబుతారు.

మంచిచేసినా ఎందుకు విమర్శలకు గురికావాలి

మంచిచేసినా ఎందుకు విమర్శలకు గురికావాలి

మంచిచేసినా ప్రతిపక్షం విమర్శలు చేస్తోంది. మంచిచేసినా ప్రతిపక్షం విమర్శలు చేయడానికి రాజకీయాలు కారణం. ప్రజల కోసం వాటికి మనం బదులివ్వాల్సిన అవసరం ఉంది. స్విస్ ఛాలెంజ్ విధానంపై ప్రజలకు వివరాలివ్వాలని ఆయన మంత్రులకు సూచించారు. పార్టీ కార్యకర్తలకు కూడ ఈ విషయమై అవగాహాన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. స్విస్ చాలెంజ్ పై సమగ్రమైన నోట్ ను తయారు చేయాలని ఆయన ఉన్నతాధికారులకు సూచించారు.

స్విస్ చాలెంజ్ విధానాన్ని వివరించిన అజయ్ జైన్

స్విస్ చాలెంజ్ విధానాన్ని వివరించిన అజయ్ జైన్

మంత్రివర్గ సమావేశంలో స్విస్ చాలెంజ్ విధానంపై రాష్ట్ర ఇంధన వనరుల శాఖ కార్యదర్శి అజయ్ జైన్ వివరించారు.అయితే అజయ్ జైన్ చెప్పే ప్రతి అంశాన్ని అర్థం చేసుకోవాలని చంద్రబాబునాయుడు మంత్రులకు సూచించారు.స్విస్ ఛాలెంజ్ పై విపక్షాలు చేసే విమర్శలను తిప్పికొట్టాలంటే స్విస్ చాలెంజ్ విధానాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనలు, కొర్టు కేసులు తదితర పరిణామాలను బాబు క్యాబినెట్ సమావేశంలో వివరించారు.ఈ పరిణామాలన్నింటితో ఆయన మంత్రులకు ఈ విషయమై పూర్తిగా అవగాహాన కల్పించేందుకు ప్రయత్నించారు.

అవినీతి అదికారులపై కఠినంగా వ్యవహరించాలి

అవినీతి అదికారులపై కఠినంగా వ్యవహరించాలి

తమ శాఖల్లో చోటుచేసుకొంటున్న అవినీతిపై మంత్రులు ఓ కన్నేసి ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. ప్రస్తుత బదిలీల్లో అవినీతి జరగకుండా చూడడంతో పాటు అవినీతిపరులైన అధికారులకు ప్రాధాన్యత ఉన్న పోస్టులు రాకుండా చూడాలన్నారు. ఇకపై ఎవరూ అవినీతికి పాల్పడినా సహించేది లేదన్నారు సిఎం. ఇన్పర్మేషన్ టెక్నాలజీని అన్ని ప్రభుత్వ శాఖలు వినియోగించుకోవాలన్నారు. అగ్రి గోల్డ్ తో పాటు అలాంటి నేరాలకు పాల్పడ్డ కంపెనీల ఆస్తులను వేలం వేసే ప్రక్రియలో కొంత ప్రగతి కన్పించిందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Wide debete on swiss challenge subject said Andhrapradesh chiefminister Chandrababu naidu in cabinet meeting held at Amaravati on Tuesday.Andhrapradesh cabinet approved swiss challenge , ysrcp opposed swiss challenge.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి